Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచంలో అత్యుత్తమ యార్కర్ బౌలర్ అతడే: బుమ్రా

Lasith Malinga is worlds best yorker bowler, says Jasprit Bumrah
Jasprit Bumrah Names ‘The Best Yorker Bowler In The World’

ముంబై: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ యార్కర్ బౌలర్ శ్రీలంక పేసర్ లసిత్ మలింగ అని టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అభిప్రాయపడ్డాడు. మలింగ ఓవర్లోని ఆరు బంతులను కూడా యార్కర్లుగా సంధించగలడు అని కితాబిచ్చాడు. ప్రస్తుత పేస్ బౌలర్లలో యార్కర్లని సంధించడంలో మలింగ, బుమ్రాకి తిరుగులేదు. అయితే అత్యుత్తమ యార్కర్ బౌలర్ మలింగ అని బుమ్రా చెప్పడం విశేషం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున మలింగ, బుమ్రా కలిసి ఆడుతున్న విషయం తెలిసిందే.

అత్యుత్తమ యార్కర్ బౌలర్ మలింగ:

అత్యుత్తమ యార్కర్ బౌలర్ మలింగ:

ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యార్కర్ల గురించి జస్‌ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ... 'ప్రపంచంలో అత్యుత్తమంగా యార్కర్లని సంధించగలిగే బౌలర్ లసిత్ మలింగ. సుదీర్ఘకాలంగా అతను యార్కర్ల సంధిస్తూ సక్సెస్ అవుతున్నాడు. ఓవర్లోని ఆరు బంతులను కూడా యార్కర్లుగా సంధించగలడు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, ఇప్పుడూ కూడా చెపుతున్నా.. నా బౌలింగ్‌ మెరుగుదలకు మలింగ సాయపడ్డాడు' అని బుమ్రా తెలిపాడు.

లాలాజలం రుద్దకపోతే:

లాలాజలం రుద్దకపోతే:

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐసీసీ నిబంధనల్ని మార్చడంపైన కూడా బుమ్రా స్పందించాడు. ఇప్పటికే ఐసీసీ రూల్స్‌ బ్యాట్స్‌మెన్‌‌కి అనుకూలంగా ఉన్నాయని, బంతి మెరుపు కోసం చెమట లేదా లాలాజలాన్ని రుద్దకూడదనే కొత్త నిబంధనని పూర్తిగా వ్యతిరేకించాడు. 'మైదానంలో హగ్, హైఫైకి నేను మొదటి నుంచి దూరం. ఆ నిబంధన మార్పుతో నాకేమీ ఇబ్బంది లేదు. కానీ బంతిపై లాలాజలాన్ని రుద్దకూడదనేది ఫాస్ట్ బౌలర్లపై ప్రభావం చూపుతుంది. స్టేడియాలు చిన్నవవుతున్నాయి.. వికెట్లు కూడా ఫ్లాట్‌గా మారిపోయాయి. దాంతో బౌలర్ వద్ద ఉన్న ఆయుధాలు స్వింగ్ లేదా రివర్స్ స్వింగ్. కానీ బంతిపై లాలాజలం రుద్దకపోతే మెరుపు కోల్పోయిన బంతి నుంచి బౌలర్ ఎలాంటి స్వింగ్ రాబట్టలేడు' అని టీమిండియా పేస్ గుర్రం పేర్కొన్నాడు.

బంతితో ఏదో ఒకటి చేయాలి:

బంతితో ఏదో ఒకటి చేయాలి:

'బంతి స్వింగ్‌ కావడంపై బ్యాట్స్‌మెన్‌ ఫిర్యాదులు చేస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేనెప్పుడు ఆడినా ఇలాంటివి వింటుంటాను. బంతి ఉన్నదే స్వింగ్‌ చేయడానికి కదా?. బంతితో ఏదో ఒకటి చేయడమే మా పని. ఊరికే అలా విసరడానికా బౌలర్లు లేరు. బ్యాట్స్‌మెన్‌కు నేనెప్పుడూ ఇదే చెబుతాను. వన్డేల్లో చివరిసారిగా బంతి ఎప్పుడు రివర్స్‌స్వింగ్‌ అయిందో తెలియదు. ఈ రోజుల్లో కొత్త బంతి సైతం బాగా స్వింగ్‌ అవ్వడం లేదు' అని బుమ్రా చెప్పాడు.

శరీరం ఎలా స్పందిస్తుందో తెలియదు:

శరీరం ఎలా స్పందిస్తుందో తెలియదు:

'ఎక్కువ రోజులు ఇంటి వద్దే విశ్రాంతి తీసుకోవడంతో తిరిగి మైదానంలో తొలి బంతి వేసినప్పుడు శరీరం ఎలా స్పందిస్తుందో చూడాలి. మైదానాలు తెరవగానే శిక్షణ ఆరంభిస్తా. ప్రస్తుతానికైతే దృఢంగానే ఉన్నా. సాధారణంగా నేను వారానికి ఆరు రోజులు సాధన చేస్తా. కానీ నేను బౌలింగ్‌ చేసి చాలా రోజులైంది. తొలి బంతి వేసేటప్పుడు శరీరం ఎలా స్పందిస్తుందో తెలియదు. ఇంత సుదీర్ఘ విరామం ఎప్పుడూ రాలేదు. సాధారణంగా నా బౌలింగ్‌ శైలి చూసి ఎంతో మంది వ్యాఖ్యలు చేస్తారు. కానీ నేను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నా' అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, June 5, 2020, 13:52 [IST]
Other articles published on Jun 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+