Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మలింగ హ్యాట్రిక్ సాధించినా: 45 పరుగుల తేడాతో లంక ఓటమి

హైదరాబాద్: శ్రీలంక పేసర్ లసిత్ మలింగ హ్యాట్రిక్ సాధించిన బంగ్లాదేశ్ చేతిలో ఆ జట్టు ఓటమిని తప్పించలేకపోయాడు. కొలంబో వేదికగా గురువారం జరిగిన రెండో టి20లో బంగ్లాదేశ్‌ 45 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 176 పరుగులు చేసింది.

షకీబ్ ఉల్ హసన్‌ (38), ఇమ్రుల్‌ కైస్‌ (36), సౌమ్య సర్కార్‌ (34) పరుగులతో రాణించారు. ముష్ఫికర్, మొర్తజా, మిరాజ్‌లను వరుస బంతుల్లో అవుట్‌ చేసి మలింగ హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మలింగకు ఇది నాలుగో హ్యాట్రిక్ కావడం విశేషం. అంతకుముందు వన్డేల్లో మూడు సార్లు హ్యాట్రిక్ సాధించాడు.



అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18 ఓవర్లలో 131 పరుగుల వద్ద ఆలౌటైంది. శ్రీలంక జట్టులో కపుగెదెర ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సు సాయంతో 50 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ 4, షకిబ్ ఉల్ హాసన్ మూడు వికెట్లు తీశారు.

దీంతో రెండు టీ20ల సిరిస్ 1-1తో సమమైంది. ఈ మ్యాచ్‌తో బంగ్లాదేశ్ కెప్టెన్‌ మొర్తజా అంతర్జాతీయ టి20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇదిలా ఉంటే ఈ టీ20 సిరిస్ అనంతరం పేసర్ లసిత్ మలింగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరనున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+