50 వికెట్లు: మెక్‌గ్రాత్, మురళీధరన్ రికార్డు బద్దలు కొట్టిన లసిత్ మలింగ

హైదరాబాద్: లీడ్స్ వేదికగా శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక సీనియర్ పేసర్ లసిత్ మలింగ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మలింగ నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తన క్రికెట్ కెరీర్‌లో ఇప్పటివరకు నాలుగు ప్రపంచకప్‌లాడిన మలింగ మొత్తం మీద 50 వికెట్లు తీసుకున్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
వరల్డ్‌కప్ చరిత్రలో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసుకున్న బౌలర్‌గా మలింగ రికార్డు అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డును అందుకున్న వారిలో మెక్‌గ్రాత్, ముత్తయ్య మురళీధరన్, వసీం అక్రమ్‌లు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో చేరిన నాలుగో బౌలర్‌గా మలింగ అరుదైన గుర్తింపు పొందాడు.
26వ మ్యాచ్‌లోనే 50 వికెట్లు
మెక్‌గ్రాత్, ముత్తయ్య మురళీధరన్‌లు 30 మ్యాచుల్లో 50 వికెట్లు తీసుకున్నారు. ఇక, పాక్ పేసర్ వసీం అక్రమ్ 34 మ్యాచుల్లో ఆ రికార్డును అందుకోగా... మలింగ తన 26వ మ్యాచ్‌లోనే ఈ మార్కుని అందుకోవడం విశేషం. లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు షాకిస్తూ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
శ్రీలంక నిర్దేశించిన 233 పరుగుల చేధనలో
శ్రీలంక నిర్దేశించిన 233 పరుగుల చేధనలో ఇంగ్లాండ్ 47 ఓవర్లలో 212 పరుగుల వద్దకే ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (89 బంతుల్లో 82 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో నాటౌట్ నిలివగా... జో రూట్ (89 బంతుల్లో 57; 3 ఫోర్లు) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో లసిత్ మలింగ (4/43) మాయ చేశాడు. స్పిన్నర్ ధనంజయ 3 వికెట్లు తీశాడు.
26 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన ఇంగ్లాండ్
శ్రీలంక పేసర్ లసిత్ లసిత్ మలింగ రెచ్చిపోవడంతో ఇంగ్లాండ్ 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బెయిర్‌స్టో (0) ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగితే.. ఏడో ఓవర్‌లో జేమ్స్ విన్స్ (14) పెవిలియన్ బాటపట్టాడు. ఈ దశలో రూట్ (57), కెప్టెన్ మోర్గాన్ (21)మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
అద్భుతమైన రిటర్న్ క్యాచ్
ఈ దశలో ఉడాన అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో మోర్గాన్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. రూట్‌కు స్టోక్స్ జతకలవడంతో ఇన్నింగ్స్ జోరందుకుంది. వీరిద్దరూ ఎడాపెడా భారీ షాట్లు బాదడంతో చేధించాల్సిన లక్ష్యం తగ్గింది. నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించాక రూట్‌ను కూడా మలింగ్ ఔట్ చేశాడు. 20 ఓవర్లలో ఇంగ్లాండ్ విజయానికి 107 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో ఓ ఎండ్‌లో స్టోక్స్ పోరాడుతున్నా.... క్రీజులోకి వచ్చిన వారంతా తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరడంతో ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు.

ఏంజెలో మ్యాథ్యూస్ హాఫ్ సెంచరీ
అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య జట్టుకు 233 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక జట్టులో ఏంజెలో మ్యాథ్యూస్ 115 బంతుల్లో 85(5 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించగా అవిష్కా ఫెర్నాండో 39 బంతుల్లో 49(6 ఫోర్లు, 2 సిక్సులు), కుశాల్ మెండిస్ 68 బంతుల్లో 46(2ఫోర్లు) ఫరవాలేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ చెరో మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ రెండు, క్రిస్ వోక్స్ ఒక వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications