న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరిస్‌కు కెప్టెన్‌గా లసిత్ మలింగ

హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత లసిత్ మలింగా మరొకసారి శ్రీలంక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌తో జనవరి 3 నుంచి జరిగే పరిమిత ఓవర్ల సిరిస్‌కు కెప్టెన్‌గా సీనియర్ క్రికెటర్ లసిత్ మలింగను నియమించింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు శుక్రవారం అధికారిక ప్రకటన చేసింది. 17 మందితో కూడిన జట్టును శ్రీలంక బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం శ్రీలంక జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది.
ఈ పర్యటనలో భాగంగా 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌తో పాటు 3 వన్డేలు, ఏకైక టీ20ని ఆడనుంది. 2014 టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టుకు మలింగ నాయకత్వం వహించాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 2016లో మరోసారి శ్రీలంక జట్టు కెప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు.
ఆ తర్వాత గాయల కారణంగా మలింగకు జట్టులో చోటు దక్కడమే ఖాయమైంది. ఇటీవల మళ్లీ ఫిట్‌నెస్‌ను నిరూపించుకుని పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడుతున్న మలింగాను తిరిగి కెప్టెన్‌గా నియమించడం విశేషం. చివరగా మలింగ గతేడాది ఆగస్టులో భారత పర్యటనకు వచ్చిన సమయంలో నాలుగో వన్డేకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ పర్యటనలో శ్రీలంక తాత్కాలిక కెప్టెన్ చమర కపుగెదర వెన్నునొప్పి గాయం కారణంగా నాలుగో వన్డేకు దూరమయ్యాడు.
శ్రీలంక జట్టు:
లసిత్ మలింగ(కెప్టెన్), నిరోషాన్ డిక్వెల్లా(వైస్ కెప్టెన్), ఏంజెలో మ్యాథ్యూస్, ధనుష్క గుణతిలక, కుషాల్ జనితే పెరీరా, దినేశ్ చండీమాల్, ఆషేలా గుణరత్న, కుశాల్ మెండిస్, ధనుంజయ డిసెల్వా, తిషారా పెరీరా, దాసన్ షణక, లక్ష్మణ్ సందకన్, ప్రసన్న, ధుష్మంత ఛమీరా, కాసున్ రంజిత, నువాన్ ప్రదీప్, లాహిరు కుమార
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications