Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లారాను భయపెట్టిన గేల్: ఇలా, ఆ కథ ఇదీ....

న్యూఢిల్లీ: తన తోటి ఆటగాడు బ్రియాన్ లారా కంగారు గురించి వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ వెల్లడించిన విషయం ఆసక్తికరంగా మారింది. తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను చితకబాదిన చరిత్ర మాజీ ఆటగాడు బ్రియాన్ లారాది. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బంతులను బౌండరీలను దాటించే నేర్పు క్రిస్ గేల్‌ది.

2005లో జరిగిన ఓ సంఘటన గురించి క్రిస్ గేల్ తన సిక్స్ మిషన్ పుస్తకంలో వెల్లడించాడు, 2005లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బ్రియాన్‌ లారా 4 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. క్రిస్‌గేల్‌ మాత్రం దక్షిణాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడికి దిగి 317 పరుగులు చేశాడు.

Chris Gayle

గేల్‌ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు లారా బాల్కనీలో కూర్చుని పుస్తకం చదువుకుంటూ కనిపించాడు. అయితే తరచూ లేచి బాల్కనీ నుంచే స్కోరు బోర్డు చూస్తూ కంగారుపడ్డాడట. ఇటీవల విడుదలైన తన 'సిక్స్‌ మిషన్‌' అనే ఆత్మకథ పుస్తకంలో క్రిస్‌గేల్‌ ఆ విషయాన్ని వెల్లడించాడు.

ఇంగ్లాండుతో 2004లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బ్రియాన్‌ లారా 400 పరుగులు చేసి రికార్డు సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. కొందరు క్రికెటర్లు తమ రికార్డులను ఎక్కువ పట్టించుకుంటారని, ఆ మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే ఔటైన లారా బాల్కనీలో పుస్తకం చదువుతూనే మధ్యమధ్య బయటకు వచ్చి స్కోరు బోర్డు చూసి లోపలికెళ్లడాన్ని చూసి తోటి ఆటగాడు శర్వాణ్‌ గమనించి ఆశ్చర్యానికి గురయ్యాడని గేల్ వివరించాడు.

కాను అతని అత్యధిక స్కోరు రికార్డుకి చేరువవుతున్న కొద్దీ లారాలో కంగారు పెరిగినట్లు కనిపించిందని, మ్యాచ్‌ విరామ సమయాల్లో కూడా లారా ఎలాంటి సలహాలు నాకు ఇవ్వలేదని అతను చెప్పాడు. 2010లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో క్రిస్‌గేల్‌ మరోసారి 333 పరుగులతో ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు. కానీ లారా రికార్డును మాత్రం ఛేదించలేకపోయాడు. ఇప్పటికీ టెస్టుల్లో అత్యధికంగా 400 పరుగులు చేసిన రికార్డు లారా పేరు మీదే ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+