బ్యాట్స్‌మెన్‌ను బంతితో కొట్టిన బౌలర్.. 5 పరుగులు జరిమానా విధించిన అంపైర్ (వీడియో)

లాంక్‌షైర్: మైదానంలో బ్యాట్స్‌మెన్, బౌలర్ మధ్య ఆధిపత్య పోరు సహజం. కానీ ఒక్కోసారి ఆ పోటీ హద్దులు దాటుతుంటుంది. అలా బౌలర్లు లేదా ఫీల్డర్లు హద్దులు దాటితే.. ఎలాంటి వార్నింగ్ లేకుండా పరుగుల జరిమానాగా విధిస్తారు. తాజాగా ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న కౌంటీ క్రికెట్ బాబ్ విల్లిస్ ట్రోఫీలో ఇదే జరిగింది. బౌలర్ తనవైపు వచ్చిన బంతిని బ్యాట్స్‌మెన్ వైపు బలంగా విసిరడంతో అతనికి బలంగా తగిలింది. దీన్ని తప్పుబట్టిన అంపైర్ బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు ఐదు పరుగులు అదనంగా జతచేశాడు.
బ్యాట్స్‌మెన్‌పైకి త్రో:
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో భాగంగా ఆదివారం లాంక్‌షైర్, లీసెస్టర్‌సైర్ మధ్య మ్యాచ్ జరిగింది. లాంక్‌షైర్ బౌలర్ డీటర్ క్లైన్ బౌలింగ్‌లో లీసెస్టర్‌సైర్ బ్యాట్స్‌మెన్ డానీ లాబ్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో క్లైన్ విసిరిన ఓ ఫుల్ లెంగ్త్ డెలివరీని డానీ స్ట్రయిట్‌గా హిట్ చేశాడు. నేరుగా వెళ్లిన బంతి బౌలర్ క్లైన్ చేతికి చిక్కింది. దాంతో బ్యాట్స్‌మెన్ డానీ కనీసం పరుగు కోసం కూడా ప్రయత్నించలేదు. అయినప్పటికీ వికెట్లపైకి బంతిని విసిరే నెపంతో బ్యాట్స్‌మెన్‌పైకి త్రో విసిరాడు.

5 పెనాల్టీ పరుగులు:
డైటర్ క్లైన్ విసిరిన బంతి బ్యాట్స్‌మెన్ డానీ లాబ్ కాలికి బలంగా తగలడంతో అతను బ్యాట్ వదిలేసి పక్కకు వెళ్ళిపోయాడు. నొప్పితో కాసేపు విలవిలలాడిపోయాడు. లాంక్‌షైర్ ఆటగాళ్లు అతని వద్దకెళ్లి లేపే ప్రయత్నం చేశారు. ఇంతలో లీసెస్టర్‌సైర్ ఫిజియో చికిత్స చేసిన తర్వాత అతను తిరిగి కోలుకున్నాడు. అనంతరం డానీ లాబ్ బ్యాటింగ్‌ని కొనసాగించాడు. దీన్ని చూసిన అంపైర్ అది ప్రమాదకరమైన త్రో అని, నేరుగా బ్యాట్స్‌మెన్‌కు తగిలిందని డీటర్‌ను మందలించాడు. ఆ తర్వాత లాంక్‌షైర్ జట్టుకు అదనంగా 5 పెనాల్టీ పరుగులు జతచేస్తున్నట్లు ప్రకటించాడు.

బెన్ స్లేటర్ సెంచరీ:
మొదటగా బ్యాటింగ్ చేసిన లాంక్‌షైర్ 322 పరుగులు చేసింది. కెప్టెన్ డేన్ విలాస్ 159 బంతుల్లో 90 పరుగులు చేసి లాంక్‌షైర్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్టీవెన్ క్రాఫ్ట్ 199 బంతుల్లో 63 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఐదవ వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. క్లీన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లీసెస్టర్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 183/2 రోజును ముగించింది. బెన్ స్లేటర్ (104) అజేయ సెంచరీ చేసాడు. ఓపెనర్ హసన్ ఆజాద్ (58) పరుగులతో క్రీజులో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications