Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వెనక్కి తగ్గిన లలిత్ మోడీ

Lalit Modi
న్యూఢిల్లీ: ఐపియల్ కమిషనర్ లలిత్ మోడీ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు. ఈ నెల 26వ తేదీన జరిగే పాలక మండలి సమావేశం చట్టబద్దతను ప్రశ్నిస్తూ కోర్టుకెక్కుతానని సవాల్ చేసిన ఆయన ఇప్పుడు ఆ నిర్ణయాన్ని ఉహసంహరించుకున్నారు. తనపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఐదు రోజుల గడువు కావాలని ఆయన బిసిసిఐని కోరారు. ఐదేళ్లు పనిచేసిన తనకు ఐదు రోజుల సమయం ఇవ్వాలని ఆయన కోరారు. పాలకమండలిలో అడిగే వివిధ ప్రశ్నలకు సమాధానాల్ని సిద్ధంచేసుకోవడానికి తనకు మరో ఐదు రోజులు గడువు ఇవ్వాలని బీసీసీఐని కోరారు. ఐపీఎల్‌ ఫైనల్‌ 25వ తేదీ జరుగుతుంది కాబట్టి ఆ మరుసటి రోజే పాలకమండలి సమావేశంలో సమాధానాలు ఇవ్వడం తనకు కష్టమని అన్నారు. సమావేశానికి అవసరమైన పత్రాలు తయారుచేసుకోవడానికి సమయం కావాలని మోడీ కోరుతున్నారు.

అయితే 26వ తేదీన పాలక మండలి భేటీని జరిపి తీరతామని బీసీసీఐ అంటోంది. ఆ రోజు లలిత్‌ మోడీకి ఉద్వాసన పలకడానికి బీసీసీఐ రంగం సిద్ధంచేసింది. ఒకవేళ మోడీ తొలగింపునకు పాలకమండలి అనుమతి ఇవ్వకపోయినా తమ నిబంధనల్లోని 32వ సెక్షన్‌ ప్రకారం అతన్ని తొలగించే అధికారం బీసీసీఐకి ఉందని అందులోని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. మోడీ స్థానంలో బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్‌ మనోహర్‌ను ఐపీఎల్‌ చీఫ్‌గా నియమించవచ్చని అంటున్నారు. మోడీ వైదొలగాల్సిందేనన్న సంకేతాల్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌శుక్లా కూడా ఇచ్చారు. 'ఆయనలో విజ్ఞత వర్ధిల్లుగాక'అని శుక్లా శుక్రవారం వ్యాఖ్యానించారు. ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీని కలిసి, ఐపీఎల్‌ వివాదంపై వివరించినతర్వాత శుక్లా ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు పాలక మండలి భేటీ జరగకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎ.సి.ముత్తయ్య శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. ఐపీఎల్‌ చీఫ్‌కు మాత్రమే సమావేశాన్ని ఏర్పాటుచేసే అధికారం ఉంది తప్పితే బీసీసీఐ కార్యదర్శి శ్రీనివాసన్‌ ఈ సమావేశాన్ని ఎలా ఏర్పాటుచేస్తారని ముత్తయ్య తన పిటిషన్‌లో వాదించారు. శ్రీనివాసన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ యజమాని అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ బీసీసీఐ సభ్యులు సొంత జట్లను కలిగి ఉండవచ్చా? అనే దానిని కోర్టు నిర్ణయించాలని ముత్తయ్య కోరారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+