Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లలిత్ మోడీపై సస్పెన్షన్ వేటు

Lalit Modi
ముంబై: వూహించినట్లుగానే వివాదాస్పద ఐపీఎల్‌ ఛైర్మన్‌, కమిషనర్‌ లలిత్‌ మోడీని బీసీసీఐ సస్పెండ్ చేసింది. ఆదివారం రాత్రి ఐపీఎల్‌-3 ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన మరుక్షణమే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. నలుగురు సభ్యుల బీసీసీఐ బృందం మోడీపై అభియోగపత్రాన్ని రూపొందించి ఈమెయిల్‌ ద్వారా ఆయనకు పంపింది. మోడీపై చర్యల గురించి చర్చించేందుకు సోమవారం ఐపీఎల్‌ పాలకమండలి సమావేశం కానున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకొంది. సస్పెన్షన్‌పై మోడీ వెంటనే స్పందించారు. తన తప్పేమీ లేదన్నారు. కేవలం ఆరోపణల ఆధారంగానే తనపై చర్య తీసుకొన్నారని మండిపడ్డారు. తెర వెనక పెద్ద నాటకమే జరుగుతోందని ఆయన బీసీసీఐపై ధ్వజమెత్తారు. ఐపీఎల్‌లో అక్రమాలేవీ జరగలేదని, ఒకవేళ జరిగి ఉంటే అందుకు తానే బాధ్యత వహిస్తానని స్పష్టం చేశారు. అందరూ ఐపీఎల్‌ ప్రతిష్ఠకు భంగం వాటిల్లకుండా చూడాల్సి ఉందని పేర్కొన్నారు. ఐపీఎల్‌ ఈసారి పెను సవాళ్లను ఎదుర్కొందని వ్యాఖ్యానించారు.

మోడీని సస్పెండ్‌ చేయాలని బీసీసీఐ పెద్దలు ముందే నిర్ణయించుకున్నారు. ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసే వరకు నిర్ణయాన్ని అమలు చేయలేదు. లలిత్ మోడీ చేత రాజీనామా చేయించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేద. ఐపీఎల్‌ ఛైర్మన్‌గా, కమిషనర్‌గా సోమవారం పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించడానికి వస్తున్నట్లుగా ప్రకటించారు. డాక్యుమెంట్ల ఆధారం చూపుతూ చేసే లిఖిత పూర్వక ఆరోపణలకే సమాధానం ఇస్తానని పాలక మండలికి అజెండాను నిర్దేశించారు. తద్వారా రాజీ పడేది లేదని తేల్చిచెప్పారు. బీసీసీఐ పెద్దల బండారం బయట పెడతానని శనివారం హెచ్చరించారు.తాను సమావేశానికి హాజరవడం ద్వారా బీసీసీఐను న్యాయపరమైన చిక్కుల్లో ఇరికించాలని మోడీ భావిస్తున్నారు. సమావేశానికి రానిస్తే ఆయన వాదన తప్పనిసరిగా వినాల్సి ఉంటుంది. అందుకే బీసీసీఐ త్వరత్వరగా పావులు కదిపింది.

సమావేశానికి వస్తానని మోడీ ప్రకటించగానే బీసీసీఐలో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. "మేం వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. లక్ష్యం మాత్రం మారదు. ఆయన్ను తొలగించాల్సిందే. మోడీ భారత క్రికెట్‌కు సిగ్గుపడే పరిస్థితి కల్పించారు" అని బీసీసీఐ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఆదివారం ముంబయిలోని బీసీసీఐ కేంద్ర కార్యాలయంలో ముఖ్యులు సమావేశమై మోడీని ఎలా తొలగించాలనే విషయమై చర్చించారు. బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్‌ మనోహర్‌, ఉపాధ్యక్షుడు అరుణ్‌ జైట్లీ, కార్యదర్శి ఎన్‌.శ్రీనివాసన్‌, ముఖ్య పాలనాధికారి రత్నాకర్‌ షెట్టి, మీడియా, ఆర్థిక వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా, ఐపీఎల్‌ వైస్‌ ఛైర్మన్‌ నిరంజన్‌ షా హాజరు అయ్యారు.

బీసీసీఐలో ఇప్పుడెవరూ మోడీకి మద్దతుగా లేనప్పటికీ ఫ్రాంచైజీల యజమానులు మాత్రం ఆయన పట్ల సానుభూతితో ఉన్నట్లు సమాచారం. మీడియా అతివల్లే ఆయనకీ పరిస్థితి వచ్చిందని వాళ్లు భావిస్తున్నారు. మోడీకి తన వాదన చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలన్నది ఫ్రాంచైజీల అభిప్రాయంగా ఉంది. ప్రస్తుతం మోడీ పరిస్థితి ఎంతగా దిగజారిందంటే...మోడీ ఛైర్మన్‌గా ఉన్న ఛాంపియన్స్‌ లీగ్‌ ట్వంటీ 20 ఏర్పాట్ల సమావేశం ఆయన లేకుండానే జరిగింది. శుక్రవారం మోడీ ఆధ్వర్యంలో ముంబయిలో జరిగిన ఐపీఎల్‌ అవార్డుల బహూకరణ కార్యక్రమానికి బీసీసీఐ నుంచి ఒక్కరూ రాలేదు.

'బీసీసీఐ నియమించిన ఏ వ్యక్తివల్ల అయినా సంస్థ నిబంధనల ఉల్లంఘన జరిగితే క్రమశిక్షణ సంఘం దర్యాప్తు చేయవచ్చు' అని బీసీసీఐ నియమావళిలో ఉంది. దర్యాప్తు కన్నా ముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని సస్పెండ్‌ చేసే అధికారం బీసీసీఐ అధ్యక్షుడికి ఉంది. అయితే, ఆరు నెలల్లోగా దర్యాప్తు పూర్తయి తీర్పు వెలువడాలి. బీసీసీఐ వార్షిక సమావేశం 3/4 మెజారిటీతో ఆమోదించాలి. బీసీసీఐ క్రమశిక్షణ సంఘం ఏర్పాటు కాలేదు కాబట్టి అధ్యక్షుడే స్వయంగా సస్పెన్షన్‌కు నిర్ణయం తీసుకొన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+