అందుకే పారిపోయా: లలిత్ మోదీ
ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తన తాజా పాడ్‌కాస్ట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు. మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగస్వామ్యం కావాలని అండర్‌వరల్డ్ బెదిరించిందని, తన కొడుకు కిడ్నాప్ బెదిరింపులు వచ్చాయన్నారు. ఫిక్సింగ్‌కు ఒప్పుకోని తనను హత్య చేసేందుకూ ప్రయత్నించారని మోడీ తెలిపారు. దాదాపు మూడున్నర గంటలపాటు సాగిన పాడ్‌కాస్ట్ చర్చతో లలిత్ మోదీ తిరిగి వార్తల్లో నిలిచారు. భారత్ వదిలి వెళ్లడం, మ్యాచ్ ఫిక్సింగ్, అండర్‌వరల్డ్ బెదిరింపులపై ఆయన కూలంకషంగా మాట్లాడారు. 'పారిపోయిన వ్యక్తి'గా తనను పేర్కొనే వాదనలను పూర్తిగా తిరస్కరించిన మోడీ, 2010 మే నుంచి లండన్‌లో నివసిస్తున్నారు.
'విజ్డెన్ క్రికెట్' పాడ్‌కాస్ట్ 'ది స్కూప్'లో లలిత్ మోదీ,ఫిక్సింగ్‌లో చేరనందుకు తనకు ఎదురైన బెదిరింపులు, హత్యాయత్నాలు వివరించారు. ఈ సంఘటనలు తన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయన్న ఆయన, ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ప్రయత్నాల గురించి ప్రస్తావించారు. ''నాతో ఫిక్సింగ్ చేయడానికి ప్రయత్నించిన చోటా షకీల్, దావూద్ వంటి వారే తరువాత గురునాథ్ మయప్పన్‌తో చేతులు కలిపారు. నేను దానిని అంగీకరించకపోవడం వల్లే వారు నా వెంటపడ్డారు. నా కొడుకును కిడ్నాప్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా నన్ను చంపడానికి ప్రయత్నించారు. వారు సాధారణ వ్యక్తులు కారు'' అని లలిత్ మోడీ అన్నారు.

తనపై ప్రస్తుతం ఒక్క కేసు కూడా లేదని లలిత్ మోడీ స్పష్టం చేశారు. భారత్‌కు తిరిగి రాకపోవడానికి కేసులే కారణమా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ, ''నేనిక్కడ బాగా స్థిరపడ్డాను. నాపై ఎక్కడా ఏ కేసు లేదు. పారిపోయిన వ్యక్తి అంటే మీపై కేసు ఉండి పారిపోతేనే అవుతారు'' అని స్పష్టం చేశారు. ఎన్. శ్రీనివాసన్ దాఖలు చేసిన ఒక్క ఎఫ్ఐఆర్ మినహా తనపై ఏ కేసు నమోదు కాలేదన్నారు. ఏ ప్రభుత్వ ఏజెన్సీ కూడా తనపై చర్యలు తీసుకోలేదని, పన్నులు అన్నీ చెల్లించానని, బకాయిలేమీ లేవని మోడీ వివరించారు. భారతదేశంలో తమకు చాలా వ్యాపారం ఉందని తెలిపారు. లండన్‌లో ఇప్పుడు బాగా స్థిరపడిన లలిత్ మోదీ తన పిల్లలు అక్కడే నివసిస్తున్నారని పేర్కొన్నారు. ఐపీఎల్ లేదా బీసీసీఐతో తనకు సంబంధం లేదన్నారు. వ్యాపారంలోకి తిరిగి రావడానికి, పదవీ విరమణ వయసు దాటా, కుటుంబ ఆస్తిని పిల్లలకు అప్పగించేశానని లలిత్ మోడీ తెలిపారు.
క్రికెట్, ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌పై కూడా మోడీ తన అభిప్రాయాలను పంచుకున్నారు: ''క్రికెట్‌లో ఫిక్సింగ్ ఉంది, అది ఇప్పుడు చాలా అధునాతన స్థాయిలో ఉంది. ఐపీఎల్‌లో జరుగుతుందా లేదా అన్నది నాకు తెలియదు. నాకు అలా అనిపించడం లేదు, కానీ నేను నిజంగా తెలియదు కాబట్టి చెప్పలేనన్నారు. ''ఇది అన్నిచోట్లా ఉందో లేదో నాకు ఖచ్చితంగా తెలుసు. ఐపీఎల్‌లో జరుగుతుందని నేను అనుకోవడం లేదు, ఎందుకంటే ఇందులో డబ్బు చాలా పెద్దదిగా మారింది. ఆటగాళ్ళకు ఫిక్సింగ్ చేయడానికి ఎటువంటి కారణం లేదు, ఎందుకంటే వారికి కోల్పోవడానికి చాలా ఉంది'' అని లలిత్ మోదీ ముగించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications