టాలెంట్‌లో సచిన్ లాంటోడు: 'శాసించడానికే అతడు పుట్టాడు'
హైదరాబాద్: సంచలన విజయాలు, స్థిరమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న ఐర్లాండ్, ఆప్ఘనిస్థాన్‌కి ఐసీసీ టెస్టు హోదా ఇచ్చిన సంగతి తెలిసిందే. లాల్‌చంద్ రాజ్‌పుత్ ప్రస్తుతం అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టుకి ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఏ విధంగా క్రికెట్‌ను శాసించాడో, ఆప్ఘన్ సంచనల బౌలర్ రషీద్ ఖాన్ కూడా అలాగే బౌలింగ్‌ను శాసిస్తాడని లాల్‌చంద్ రాజ్‌పుత్ అన్నారు. లాల్‌చంద్ రాజ్‌పుత్ అన్నారు. సచిన్‌కి క్రికెట్‌లో ఏవిధంగా సహజ నైపుణ్యాలు ఉన్నాయో, బౌలింగ్ విభాగంలో అలాంటి నైపుణ్యాలు రషీద్ సొంతమని అన్నారు.
లాల్‌చంద్ రాజ్‌పుత్ గతంలో భారత జట్టుకు కోచ్‌గా కూడా పనిచేశారు. 'ప్రస్తుతం అతడు (రషీద్) ఆ దారిలో పయనిస్తున్నాడు. అతడికి సహజ నైపుణ్యాలు ఉన్నాయి. ఎవరికైతే సహజ నైపుణ్యాలు ఉన్నాయో అచ్చం సచిన్ లాగా... వారు క్రికెట్‌ను శాసిస్తారు. ఇతడు బౌలింగ్‌ను తప్పక శాసిస్తాడు. ఆఫ్ఘన్ క్రికెట్‌లో ఇతడొక పిల్లర్' అని చెప్పాడు.

భవిషత్తులో అద్భుతాలు చేయడం ఖాయం
భవిషత్తులో అతడు మరిన్ని అద్భుతాలు చేయడం ఖాయమని లాల్‌చంద్ ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీలంక ఆటగాడు అజంతా మెండీస్ బౌలింగ్‌ను ఎదుర్కొనే క్రమంలో బ్యాట్స్‌మెన్లు ఏ విధంగా ఇబ్బంది పడేవారో... ఇప్పుడు రషీద్ బౌలింగ్‌ని ఎదుర్కునేందుకు అలాగే కష్టపడుతున్నారని అన్నారు.

మెండీస్ బౌలింగ్ శైలి
గతంలో మెండీస్ బౌలింగ్ శైలి గురించి తెలుసుకునేందుకు బ్యాట్స్‌మెన్లు ప్రత్యేకంగా స్టడీ చేసిన సందర్భాలను లాల్‌చంద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2015లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు.

ఐపీఎల్ పదో సీజన్‌లో సత్తా చాటిన రషీద్
18 ఏళ్ల రషీద్ ఖాన్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ పదో సీజన్‌లో కూడా సత్తా చాటాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ప్రాతినిధ్యం వహించిన రషీద్ ఖాన్ 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు బౌలర్ల జాబితాలో రెండో స్ధానంలో నిలిచాడు.

29 వన్డేలాడి 63 వికెట్లు
రషీద్ ఖాన్ 29 వన్డేలాడి 63 వికెట్లు తీశాడు. ఇటీవలే వెస్టిండిస్‌తో జరిగిన వన్డే సిరిస్‌లో రషీద్ ఖాన్ తన కెరీర్‌లోనే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశాడు. 8.4 ఓవర్లు వేయగా అందులో ఒక మెయిడిన్ కూడా ఉంది. కేవలం 18 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు తీశాడు. వన్డేల్లో ఇది నాలుగో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications