For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫోటోలు: సిడ్నీలో చరిత్ర సృష్టించేందుకు పాక్ పేసర్లతో కోహ్లీ నెట్ ప్రాక్టీస్!

Lahore Qalandars’ pacers bowl at Indian batsmen in the nets

హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా గురువారం నుంచి ప్రారంభమయ్యే సిడ్నీ టెస్టులో కూడా గెలవాలనే గట్టి పట్టుదలతో ఉంది. దీని కోసం బుధవారం కోహ్లీసేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. సిడ్నీ టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టిస్తుంది.

గత 70 ఏళ్ల ప్రయాణంలో 12 సార్లు ఆసీస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా 47 టెస్టుల్లో తొలిసారిగా 2-1 ఆధిక్యంలో నిలిచింది. గురువారం నుంచి సిడ్నీ వేదికగా చివరి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్టులో విజయం సాధించినా లేదా కనీసం డ్రా చేసుకున్నా సిరీస్‌ను కైవసం చేసుకుని రికార్డుని సాధిస్తుంది.

బుధవారం నెట్స్‌లో

బుధవారం నెట్స్‌లో

సిడ్నీ పిచ్ స్పిన్ అనుకూలమని వార్తలు వస్తున్నప్పటికీ, బుధవారం నెట్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ పాకిస్థాన్ పేస్ బౌలర్లను ఎదుర్కొన్నారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో లాహోర్ ఖాలండర్స్‌ బౌలర్లు సల్మాన్ ఇర్షద్, హరీశ్ రవూఫ్ బౌలింగ్‌లో భారత ఆటగాళ్లు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు.

వీరిద్దరి బౌలింగ్‌ను ఎదుర్కొన్న కోహ్లీ బౌలింగ్

వీరిద్దరి బౌలింగ్‌ను ఎదుర్కొన్న కోహ్లీ బౌలింగ్

ప్రస్తుతం వీరిద్దరూ ఆస్ట్రేలియాలో క్లబ్ క్రికెట్ ఆడుతున్నారు. త్వరలోనే ఈ ఇద్దరూ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్‌)లో బరిలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరిద్దరి బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో కోహ్లీ సహా ఇతర బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతోన్న సంగతి తెలిసిందే.

పాక్ పేసర్లతో కోహ్లీ నెట్ ప్రాక్టీస్

మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్టార్క్ బౌలింగ్‌లో ఇబ్బంది పడిన విరాట్ కోహ్లీ అతడి బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరిన సంగతి తెలిసిందే. దీంతో సల్మాన్ పేస్, రవూఫ్ యార్కర్లను ప్రాక్టీస్ చేయడం ద్వారా స్టార్క్‌ను కోహ్లీ దీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంది. సల్మాన్ గంటకు 150 కిమీ వేగంతో బంతులు విసరగలడు. నెట్ ప్రాక్టీస్ సెషన్ అనంతరం రవూఫ్, సల్మాన్‌లు కోహ్లీతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రముఖ స్పోర్ట్ జర్నలిస్ట్ అనాస్ సయిద్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

 చరిత్ర తిరగరాస్తుందా?

చరిత్ర తిరగరాస్తుందా?

1977-78లో 2-2తో సమంగా ఉన్న స్థితిలో ఐదో మ్యాచ్‌లో ఓడి సిరీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత 2003-04 ఆసీస్‌ పర్యటనలో నాలుగు టెస్టుల సిరీస్‌లో రెండో టెస్టును గెలిచిన టీమిండియా 1-0తో పైచేయి సాధించింది. అయితే, తర్వాతి దాంట్లో ఓడిపోవడంతో ఆధిక్యాన్ని చేజార్చుకుంది. ఈ సిరీస్‌లో మొదటి, నాలుగో టెస్టులు డ్రాగా ముగియడంతో సిరిస్ ఫలితం 1-1గా మారింది. ఆసీస్ గడ్డపై ఇప్పటి వరకు ఈ రెండు మాత్రమే భారత్‌ సిరీస్‌ విజయానికి చేరువగా వచ్చిన సందర్భాలు. అయితే, ఇప్పుడు స్పష్టమైన ఆధిక్యంతో సిడ్నీలో గురువారం ఆతిథ్య జట్టుతో అడబోతోంది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా టీమిండియా చరిత్ర తిరగరాసినట్లవుతుంది.

Story first published: Wednesday, January 2, 2019, 15:51 [IST]
Other articles published on Jan 2, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+