Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో ఆసియా దేశంగా పాక్: లాహోర్‌లో ఐసీసీ బయోమెకానిక్స్ ల్యాబ్

 Lahore 2nd Asian city to house ICC accredited biomechanics lab

హైదరాబాద్: లాహోర్ యూనివర్సిటీలో బయో మెకానిక్స్ ల్యాబ్‌ని ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సిద్ధమైంది. అక్రమ బౌలింగ్ యాక్షన్‌కు పాల్పడిన బౌలర్లకు ఇదొక టెస్టింగ్ సెంటర్ మాదిరి అందుబాటులో ఉంటుంది. ఈ టెస్టింగ్ సెంటర్‌ను లాహోర్‌లోని లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్(ఎల్‌యుఎమ్ఎస్) బ్లాకులో ఐసీసీ ఏర్పాటు చేసింది.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

బ్రిస్బేన్‌లోని నేషనల్ క్రికెట్ సెంటర్, చెన్నైలోని రామచంద్ర యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ప్రిటోరియాలోని టెస్టింగ్ సెంటర్ల తర్వాత ఏర్పాటు చేసిన సెంటర్ ఇదే కావడం విశేషం. ఈ టెస్టింగ్ సెంటర్ ద్వారా వివిధ స్థాయిలలోని ఆటగాళ్ల బయో మెకానిక్స్ విశ్లేషణ కోసం ఈ సౌకర్యాన్ని ఐసీసీ ఉపయోగించనుంది.

ఆటగాళ్లలోని సాంకేతిక లోపాలను గుర్తించి వాటని తొలగించేందుకు ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగించబడుతుంది. ఈ టెస్టింగ్ సెంటర్ సాయంతో దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌లో పాల్గొనే ఆటగాళ్ల అక్రమ బౌలింగ్ యాక్షన్‌ గుర్తించి వాటిని సరిదిద్దేందుకు పీసీబీకి ఇది దోహద పడుతుంది.

ఈ బయో మెకానిక్స్ ల్యాబ్‌లో 12 హై స్పీడ్ కెమెరాలు ఉంటాయి. మొత్తం ఇండోర్‌లో నిర్మించిన ఈ ల్యాబ్‌లో బౌలర్లు బౌలింగ్ చేయడంతో పాటు పరిగెత్తేందుకు అనుకూలంగా నిర్మించారు. ఐసీసీ టెస్టింగ్ ప్రోటోకాల్‌ తెలిసివారు బౌలర్ల అక్రమ యాక్షన్‌పై టెస్టు నిర్వహిస్తారని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Story first published: Thursday, July 25, 2019, 17:44 [IST]
Other articles published on Jul 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+