Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనందుకు పాక్‌కు భారీ నష్టం.. ఎన్ని కోట్లో తెలుసా?!!

Lack of bilateral cricket against India results in PCB losing USD 90 million


కరాచీ:
టీమిండియాతో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఆడేందుకు గత ఐదేళ్లుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చాలా ప్రయత్నాలు చేసింది. కొన్ని సార్లు బెదిరింపులకు కూడా దిగింది పీసీబీ. అది కుదరకపోవడంతో ఐసీసీని కూడా మధ్యలోకి లాగింది. ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. దీంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగి చాలా ఏళ్లయింది. టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడం పాకిస్థాన్‌ క్రికెట్‌ను బాగా దెబ్బకొట్టింది.
IND VS PAK : PCB Lost USD 9 Million Due To Lack Of Series Against India
పాక్‌కు రూ.691 కోట్ల నష్టం:

పాక్‌కు రూ.691 కోట్ల నష్టం:

భారత్ సిరీస్‌లు నిరాకరించడంగతంలో గతంలో కుదుర్చుకున్న ప్రసారహక్కుల ఒప్పందం ప్రకారం పాక్‌కు దాదాపు రూ.691 కోట్ల (90 మిలియన్‌ డాలర్లు) నష్టం ఏర్పడింది. ఈ నెలలో ముగియనున్న ఈ ఒప్పందం ప్రకారం గత అయిదేళ్లలో అన్ని సిరీస్‌లకు (పాక్‌లో భారత్‌తో రెండు సిరీస్‌లు కలిపి) గాను 149 మిలియన్‌ డాలర్లకు ప్రసార హక్కులు అమ్ముడయ్యాయి. అయితే భారత్‌తో సిరీస్‌లు జరగకపోవడంతో ఒప్పందం ప్రకారం ఇప్పుడా మొత్తంలో రూ.691 కోట్లు కోత విధించాయి ప్రసార సంస్థలు.

భారత్‌ ఆడనందుకు:

భారత్‌ ఆడనందుకు:

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో ఐదేళ్లకాలానికి సంబంధించిన సిరీస్‌ల ప్రసారం కోసం టెన్‌‌ స్పోర్ట్స్, పీటీవీ బ్రాడ్‌కాస్టర్స్ 149 మిలియన్ డాలర్లకి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన రెండు సిరీస్‌లు కూడా ఉన్నాయి. కానీ.. పాక్‌తో సిరీస్‌ ఆడేందుకు భారత్ ఒప్పుకోకపోవడంతో పాక్‌కు భారీ నష్టం ఏర్పడింది. దీంతో ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న పీసీబీ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.

2006లో పాకిస్థాన్‌లో పర్యటించిన భారత్:

2006లో పాకిస్థాన్‌లో పర్యటించిన భారత్:

2006లో చివరిగా పాకిస్థాన్‌లో పర్యటించిన భారత్ పర్యటించింది. ఆ తర్వాత దాయాది దేశాల మధ్య సంబంధాలు సర్గలేకపోవడంతో మళ్లీ ఆ దేశంలో అడుగుపెట్టలేదు. ఇక 2009లో శ్రీలంక క్రికెటర్లపై లాహోర్‌లో ఉగ్రదాడి తర్వాత ఏ అగ్రశ్రేణి క్రికెట్ జట్టు కూడా పాక్‌ పర్యటనకి వెళ్లలేదు. దాదాపు దశాబ్దకాలం పాటు పాక్ గడ్డపై ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. మొన్నటివరకు యూఏఈ వేదికగా సిరీస్‌లు ఆడిన పాక్.. ఇటీవల శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లతో సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడింది. కోలుకునే సమయంలో కరోనా వైరస్ కాటేసింది.

ఆసియాకప్‌ వాయిదా వేయం:

ఆసియాకప్‌ వాయిదా వేయం:

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మనుగడకు భారత్‌ అవసరం లేదని పీసీబీ బోర్డు ఛైర్మన్‌ ఇషాన్ మణి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతటి ఆగకుండా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సీజన్-13 కోసం ఆసియా కప్‌ను వాయిదా వేయడానికి అంగీకరించమని స్పష్టం చేసాడు. కరోనా తీవ్రత తగ్గితే సెప్టెంబర్‌-అక్టోబర్‌లో ఐపీఎల్ నిర్వహిస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే సెప్టెంబర్‌లో దుబాయ్‌ వేదికగా ఆసియా కప్‌నకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో ఐపీఎల్ లీగ్‌ కోసం ఆసియా కప్‌ను వాయిదా వేయమని ఇషాన్ మణి అన్నాడు

Story first published: Friday, April 17, 2020, 10:58 [IST]
Other articles published on Apr 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+