For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'No. 6లో ఆడే ఆటగాడు లేకపోవడం వల్లే టీమిండియా ఓటమి'

By Nageshwara Rao
Lack of a proper No. 6 hurt India: Mohinder Amarnath

హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో 60 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను కోహ్లీసేన 1-3తేడాతో సిరిస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో చివరిదైన ఐదో టెస్టు శుక్రవారం ఓవల్‌లో వేదికగా ఆరంభం కానుంది.

టీమిండియాలో ఆరో స్థానంలో ఆడే ఆటగాడు లేని కారణంగానే టెస్టు సిరిస్‌ను కోల్పోవాల్సి వచ్చిందని మాజీ ఆటగాడు మొహిందర్‌ అమర్‌నాథ్‌ అన్నారు. ఇంగ్లాండ్‌లో హార్దిక్‌ పాండ్యా, రిషబ్‌ పంత్‌ ఈ స్థానంలో బరిలోకి దింపినప్పటికీ, ఆశించిన మేర వీరిద్దరూ రాణించలేదు.

మరోవైపు ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, బ్యాట్స్‌మెన్ ‌మాత్రం పరుగులు చేయడంలో విఫలమవుతున్నారు. ఈ సందర్భంగా మొహిందర్‌ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ "భారత్‌కు అవకాశాలు లేవని చెప్పలేం. బౌలర్లు తమ పనిని చక్కగా చేశారు. పేసర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే" అని అన్నారు.

"నిజం చెప్పాలంటే అసలు స్థాయికి తగ్గట్టు ఆడనిది బ్యాట్స్‌మెన్‌. జట్టులో క్రమం తప్పకుండా ఆరో స్థానంలో ఆడే బ్యాట్స్‌మన్‌ లేనేలేడు. ఇంగ్లాండ్‌ లాంటి పరిస్థితుల్లో ఐదుగురు బ్యాట్స్‌మెన్‌, ఆల్‌రౌండర్‌తో వెళ్లకూడదు. ఉపఖండంలో అయితే ఈ కూర్పు ఫర్వాలేదు. విదేశాల్లో మాత్రం ఇలా ఆడటం వల్ల లోపాలు బయటపడతాయి" అని అమర్‌నాథ్ అన్నారు.

"ఒక్కమాటలో చెప్పాలంటే ఇంగ్లీషు గడ్డపై బ్యాటింగ్‌ విఫలం కారణంగానే టీమిండియా ఓడిపోయింది. స్వింగ్‌ బౌలింగ్‌లో వీరంతా బాగా ఆడలేరని దీంతో తేలిపోయింది. విరాట్‌ కోహ్లీ బాగా ఆడాడు. ఛటేశ్వర్ పుజారా, అజ్యింకె రహానే ఫర్వాలేదు. మిగతా వారంతా పూర్తిగా విఫలమయ్యారు" అని అమర్‌నాథ్‌ అన్నారు.

Story first published: Thursday, September 6, 2018, 17:28 [IST]
Other articles published on Sep 6, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+