Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కళ్లుచెదిరే క్యాచ్! లబుషేన్.. నువ్వు మనిషేనా? పక్షివా? (Video)

గత వారం రోజులుగా అంతర్జాతీయ క్రికెట్‌లో అబ్బురపరిచే ఫీల్డింగ్ విన్యాసాలు జరుగుతున్నాయి. భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ, బెన్ స్టోక్స్, శ్రేయస్ అయ్యర్ గ్రేట్ క్యాచ్‌లను మరువకముందే మరికొన్ని అద్భుతాలు జరిగాయి. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో మార్నస్ లబుషేన్ పక్షిలా గాల్లో ఎగురుతూ మెరుపు వేగంతో క్యాచ్‌ను అందుకున్నాడు.

ఆస్ట్రేలియా పర్యటనకు వెస్టిండీస్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడటానికి వచ్చిన సంగతి తెలిసిందే. టెస్టు సిరీస్‌ను 1-1తో విండీస్ సమం చేసింది. కానీ వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌‌లు ఓటమిపాలై సిరీస్‌ను చేజార్చుకుంది. నామమాత్రపు ఆఖరి మ్యాచ్‌‌ను ఇవాళ కాన్‌బెర్రా వేదికగా ఆడుతోంది. అయితే లబుషేన్ అద్భుతమైన క్యాచ్‌తో వెస్టిండీస్ బ్యాటర్ కీసీ కార్టీ (10; 22 బంతుల్లో) వెనుదిరిగాడు.

Labuschagne takes stunning catch in Australia vs West Indies 3rd ODI

ఫాస్ట్ బౌలర్ లాన్స్ మోరిస్ వేసిన అవుట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను కార్టీ షాట్‌కు యత్నించాడు. తనకు దూరంగా వెళ్తున్న బంతిని లబుషేన్ కుడివైపు పక్షిలా గాల్లోకి ఎగురుతూ క్యాచ్‌ను అందుకున్నాడు. ఆ సమయంలో అతడు శరీరంగా నేలకు సమాంతంగా మారడం విశేషం. ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు వ్యాఖ్యాతలు ఫిదా అయ్యారు. ఇది బౌలర్‌కు చెందాల్సిన వికెట్ కాదని, ఫీల్డర్‌కు దక్కాలని అన్నారు. కాగా లాన్స్ మోరిస్‌కు ఇదే తన తొలి అంతర్జాతీయ వికెట్. ఇవాళ మ్యాచ్‌లోనే అతడు అరంగేట్రం చేశాడు.

రెండో వన్డేలోనూ ఆసీస్ ఫీల్డర్ కామెరూన్ గ్రీన్ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్న విషయం తెలసిందే. అబాట్ బౌలింగ్‌లో రోస్టన్ చేజ్ షాట్‌కు ట్రై చేయగా, మిడ్ వికెట్‌లో ఉన్న గ్రీన్ మెరుపు వేగంతో తన ఎడమవైపునకు దూకి క్యాచ్‌ను పట్టాడు. కాగా, మరోవైపు ఆఖరి వన్డేలోనూ వెస్టిండీస్ పేలవ ప్రదర్శన చేస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 80 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఆది నుంచే ఆస్ట్రేలియా బౌలర్లు వికెట్ల వేట మొదలుపెట్టారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ పైచేయి సాధిస్తున్నారు. క్రీజులో అల్జారీ జోసెఫ్, మొటియ్ ఉన్నారు.

Story first published: Tuesday, February 6, 2024, 11:18 [IST]
Other articles published on Feb 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+