RCB vs KKR: ఓవైపు మ్యాచ్.. మరోవైపు మసాజ్ పాపతో కైల్ జెమీసన్ రొమాన్స్!

 Kyle Jamieson Gives Romantic Looks With RCB Massage Therapist Navnita Gautam
Photo Credit: twitter

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ లీగ్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై కేకేఆర్ 9 వికెట్లతో తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా ప్లేయర్స్ డగౌట్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఓవైపు సీరియస్‌గా మ్యాచ్ జరుగుతుండగా.. మరోవైపు ఆర్‌సీబీ ఆల్‌రౌండర్, న్యూజిలాండ్ క్రికెటర్ కైల్ జెమీసన్.. టీమ్ మసాజ్ థెరపిస్ట్ నవనితా గౌతమ్‌తో ప్రేమాయణం నడిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

బ్యాటింగ్‌‌కు సిద్దంగా జెమీసన్ ప్యాడ‌ప్ అయి ముందు వరుసలో కూర్చోగా.. నవనితా గౌతమ్ వెనుక వరుసలో కూర్చుంది. అయితే మ్యాచ్ జరగుతుండగా నవనితా గౌతమ్ కోసం జెమీసన్ పదే పదే వెనక్కుతిరిగాడు. ఆమె కూడా అతని చూపులకు అదే రీతిలో రెస్పాన్స్ ఇచ్చింది. ఈ విషయాన్ని గ్రహించిన టీవీ కెమెరామన్ వీరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ ఉందన్నట్లు టీవీ కెమెరాల్లో చూపించాడు. వీరి రొమాంటిక్ లుక్స్‌ను పసిగట్టిన నెటిజన్లు వాటికి సంబంధించి స్క్రీన్ షాట్లను నెట్టింట వైరల్ చేశారు. ఈ ఇద్దరు పీకల్లోతు ప్రేమల్లో ఉన్నట్లు తెలుస్తుందని, వీరి మధ్య ఏదో జరుగుతుందని కామెంట్ చేస్తున్నారు.

కెనడాకు చెందిన నవ్‌నితా గౌతమ్ అథ్లెటిక్ థెరపిస్ట్. 2017 నుంచి ఆమె ఆర్‌సీబీ టీమ్‌కు సేవలందిస్తున్నారు. కెనడాలో జరిగే గ్లోబల్ టీ20 లీగ్‌లో టొరంటో నేషనల్స్‌ టీమ్‌కు కూడా ఆమె థెరపిస్ట్‌గా సేవలందిస్తున్నారు. ఇక ఐపీఎల్‌లో అమ్మాయిలను థెరపిస్ట్‌లుగా తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో డక్కన్ చార్జెస్ టీమ్ కూడా అమ్మాయిలనే థెరపిస్ట్‌లుగా నియమించుకుంది.

మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 19 ఓవర్లలో 92 రన్స్‌కు కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ(3/13), ఆండ్రీ రస్సెల్(3/9) బెంగళూరు పతనాన్ని శాసించగా.. ఫెర్గూసన్ రెండు, ప్రసిధ్ కృష్ణ ఓ వికెట్ తీశారు. అనంతరం కోల్‌‌కతా 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 94 రన్స్ చేసి ఘన విజయాన్నందుకుంది. చిన్న టార్గెట్‌ను ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 48), అరంగేట్ర ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 41 నాటౌట్) నింపాదిగా ఛేదించారు. ఆర్‌సీబీ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్‌కు ఓ వికెట్ దక్కింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 21, 2021, 8:31 [IST]
Other articles published on Sep 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X