రికార్డు బౌలింగ్ గణాంకాలు.. ఒక మ్యాచ్‌లో 17 వికెట్లు!!

లండన్: క్రికెట్ ఆటలో రికార్డులు బద్దలవడం సహజమే. ఎప్పుడు ఏ రికార్డు సమం అవుతుందో, బద్దలవుతుందో చెప్పలేం. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో బౌలింగ్ గణాంకాలు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ కైల్ అబ్బాట్ ఓ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఏకంగా 17 వికెట్లు వికెట్లు తీసి సంచలన గణాంకాలు నమోదు చేసాడు.

86 పరుగులు.. 17 వికెట్లు
ఇంగ్లాండ్‌లో జరిగే కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ క్రికెట్‌లో అబ్బాట్ 86 పరుగులకు 17 వికెట్లు తీసాడు. కౌంటీలో భాగంగా బుధవారం హాంప్‌షైర్, సోమర్‌సెట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అబ్బాట్ ఈ గణాంకాలు నమోదు చేసాడు. హాంప్‌షైర్ తరపున ఆడుతున్న అబ్బాట్ తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు ఇచ్చి తొమ్మిది వికెట్లు తీసాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు ఎనిమిది వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

నాలుగో అత్యుత్తమ బౌలర్
అబ్బాట్ ఈ సంచలన ప్రదర్శనతో ఒక మ్యాచ్‌లో 17 వికెట్లు తీసాడు. గతంలో ఇంగ్లాండ్ క్రికెటర్ జిమ్ లాకర్ 1956లో 90 పరుగులిచ్చి 19 వికెట్లు తీసాడు. లాకర్ తర్వాత అబ్బాట్ మాత్రమే 17 వికెట్ల అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో కౌంటీ ఛాంపియన్‌షిప్ చరిత్రలో నాలుగో అత్యుత్తమ బౌలర్‌గా కైల్ అబ్బాట్ నిలిచాడు. 2013 నుంచి 2017 మధ్య కాలంలో దక్షిణాఫ్రికా తరఫున అబ్బాట్ 11 టెస్టులు, 28 వన్డేలు, 21 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

హాంప్‌షైర్ సొంత ఊరిలా మారింది
అబ్బాట్ మాట్లాడుతూ... 'ఈ ప్రదర్శన ఎంతో ప్రత్యకం. ఇన్ని వికెట్లు తీస్తాననుకోలేదు. నా క్రికెట్ కెరీర్లో ఇదే అత్యుత్తమ బౌలింగ్. దక్షిణాఫ్రికా క్రికెట్ నుంచి తప్పుకున్న అనంతరం ఇక్కడ బాగా ఆడుతున్నా. తన ఆటకు ఇదే సరైన వేదిక. ఇక్కడ ఎంతో మంది స్నేహితులయ్యారు. హాంప్‌షైర్ సొంత ఊరిలా మారింది' అని తెలిపాడు. చివరిసారి 2017లో టెస్టు మ్యాచ్ ఆడిన తర్వాత దక్షిణాఫ్రికా జట్టుకు రాజీనామా చేసి ఇంగ్లాండ్‌లో హాంప్‌షైర్ తరఫున ఆడుతున్నాడు.

హాంప్‌షైర్ భారీ విజయం
తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ జట్టు 196 పరుగులు చేయగా.. సోమర్‌సెట్ 142 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో హాంప్‌షైర్ 226 పరుగులు చేయగా.. సోమర్‌సెట్ 144 పరుగులకు చేతులెత్తేసింది. దీంతో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి హాంప్‌షైర్ 136 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications