87 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కుక్-ఎల్గర్ జోడీ
హైదరాబాద్: పోర్ట్ ఎలిజబెత్ వేదికగా శ్రీలంకపై శుక్రవారం ముగిసిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 206 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా ఓపెనర్లు స్టీఫెన్ కుక్, ఎల్గర్ 104 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక 205 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాకు 81 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 406 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
కాగా, దక్షిణాఫ్రికా ఓపెనర్లు ఎల్గర్, కుక్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో తొలి, రెండో ఇన్నింగ్స్‌ల్లో వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తొమ్మిదో జోడిగా వీరిద్దరూ గుర్తింపు పొందారు. దక్షిణాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఓపెనింగ్ జోడిగా ఉన్నారు.

1929లో బర్మింగ్హమ్‌లో క్యాటెరల్ల్-మిచెల్ జోడి
1929లో క్యాటెరల్ల్-మిచెల్ జోడి బర్మింగ్హమ్‌లో ఈ అరుదైన ఘనతను సాధించగా మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరూ రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గతంలో హట్టన్, వాష్‌బ్రూక్ ఈ ఘనతను రెండుసార్లు సాధించారు. 488 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన లంకకు చక్కటి ఆరంభమే లభించింది.

ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు
కానీ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీంతో ఆ జట్టు 281 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు దిముత్ కరుణరత్నే (43), కుశాల్ సిల్వ (48) జట్టును ఆదుకోవడానికి కొంత సేపు ప్రయత్నించారు. మిడిల్ ఆర్డర్‌లో కుశాల్ మేండిస్ (58), కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (59) అర్ధ సెంచరీలు సాధించారు.

281 పరుగులకే శ్రీలంక ఆలౌట్
ఈ క్రమంలో వీరిద్దరూ క్రీజులో నిలదొక్కుకుని మ్యాచ్‌ని డ్రాగా ముగించేందుకు ప్రయత్నించారు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్ సహకారం లభించకపోవడంతో శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 96.3 ఓవర్లలో 281 పరుగుల వద్ద ముగిసింది. దక్షిణాఫ్రికా బౌలర్లు రబడ, కేశవ్ మహారాజ్ చెరి మూడు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించారు.

మరో 200 పరుగులు చేసుంటే బాగుండేది
తొలి టెస్టు మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ మీడియాతో మాట్లాడుతూ మా జట్టు మరో 200 పరుగులు చేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ‘తొలి ఇన్నింగ్స్‌లో మరో 200 పరుగులు అదనంగా చేసుంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. మేము మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాం. రెండో ఇన్నింగ్స్‌లో మా జట్టులోకి ప్రధాన బ్యాట్స్‌మెన్లు తడబడ్డారు. మరోవైపు సఫారీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు' అని కొనియాడాడు. రెండో టెస్టు మ్యాచ్ కేప్‌టౌన్ వేదికగా సోమవారం నుంచి జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications