KXIP vs RCB: అశ్విన్‌ మాయ.. రాహుల్ సెంచరీ.. బెంగళూరుపై 97 పరుగుల తేడాతో పంజాబ్ విజయం!!

దుబాయ్: ఐపీఎల్‌ 2020లో భాగంగా గురువారం రాత్రి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. స్పిన్నర్లు మురుగన్ అశ్విన్ (3/21)‌, రవి బిష్ణోయ్‌ (3/32).. పేసర్ షెల్డన్‌ కాట్రెల్‌ (2/17) అద్భుత ప్రదర్శన చేయడంతో కింగ్స్ పంజాబ్ 97 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. పంజాబ్ బౌలర్ల దెబ్బకు బెంగళూరు 109 పరుగులకే ఆలౌటైంది. దీంతో పంజాబ్ ఐపీఎల్ 2020లో బోణీ చేయడమే కాకుండా.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది.

 డివిలియర్స్ మెరుపులు కాసేపే:

డివిలియర్స్ మెరుపులు కాసేపే:

ఈ దశలో ఆరోన్ ఫించ్ (20), ఏబీ డివిలియర్స్‌ ( 28; 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) కాసేపు మెరుపులు మెరిపించారు. బెంగళూరు స్కోర్ బోర్డును కాసేపు పరుగులు పెట్టించారు. అయితే ఇద్దరూ కొద ఎంతసేపో క్రీజ్‌లో నిలవలేదు. 53 పరుగుల వద్ద ఫించ్‌.. రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే డివిలియర్స్‌.. మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి సర్ఫరాజ్‌ చేతికి చిక్కాడు. దీంతో బెంగళూరు 57 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. వాషింగ్టన్‌ సుందర్ ‌(30), శివమ్‌ దూబే (12) వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేశారు. దూబె ఔటయ్యాక బెంగళూరు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. దీంతో 109 పరుగులకే ఆలౌటైంది.

36 బంతుల్లో రాహుల్ హాఫ్‌సెంచరీ:

36 బంతుల్లో రాహుల్ హాఫ్‌సెంచరీ:

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 206 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ జట్టుకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్ ‌(26) బెంగళూరు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఓపెనింగ్‌ జోడీ సింగిల్స్‌ తీస్తూ స్కోర్‌ను ముందుకు నడిపించారు. ఆరు ఓవర్లకు పంజాబ్‌ వికెట్‌ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఆ తరువాతి ఓవర్లో మయాంక్‌ (26) పెవిలియన్ చేరాడు. నికోలస్ పూరన్ అండతో రాహుల్ వేగంగా ఆడాడు. ఈ క్రమంలోనే‌ 36 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు.

రాహుల్ శతకం:

రాహుల్ శతకం:

14వ ఓవర్ మొదటి బంతికి పూరన్ (17) ఔట్ అయ్యాడు. 14 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఆపై గ్లెన్ మాక్స్‌వెల్‌ (5) నిరాశపరిచాడు. అయితే మరో ఎండ్‌లో ఉన్న మాత్రం కేఎల్ రాహుల్‌ తన ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో దుమ్మురేపాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 62 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో శతకం సాధించాడు. దీంతో రాహుల్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో రెండో శతకం సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత క్రికెటర్‌గా, కెప్టెన్‌గా కూడా రికార్డ్ క్రియేట్ చేశాడు.

19వ ఓవర్లో 26 రన్స్:

19వ ఓవర్లో 26 రన్స్:

సెంచరీ మార్క్‌ చేరుకున్నాక లోకేష్ రాహుల్‌ గేర్‌ మార్చాడు. డేల్‌ స్టెయిన్‌ వేసిన 19వ ఓవర్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది ఏకంగా 26 రన్స్‌ పిండుకున్నాడు. ఇక దూబే వేసిన 20వ ఓవర్లో కరుణ్‌ నాయర్‌ (15) ఒక ఫోర్‌ బాదగా.. రాహుల్ వరుసగా ఒక ఫోర్‌, రెండు సిక్సర్లు బాది 23 రన్స్‌ రాబట్టారు. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు రాహుల్ క్రీజులో ఉండి 'వన్ మ్యాన్ షో' చేశాడు. బెంగళూరు బౌలర్లలో శివమ్‌ దూబే రెండు వికెట్లు పడగొట్టగా.. యుజువేంద్ర చహల్‌ ఒక వికెట్‌ తీశాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, September 24, 2020, 23:26 [IST]
Other articles published on Sep 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X