KXIP vs MI: తడబడిన పంజాబ్‌ బ్యాట్స్‌మన్.. 48 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం!!

అబుదాబి: ముంబై ఇండియన్స్‌ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ తడబడ్డారు. ముంబై బౌలర్ల ధాటికి పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులకే పరిమితమైంది. దీంతో రోహిత్ సేన 48 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఇది ముంబైకి రెండో విజయం. పంజాబ్ బ్యాట్స్‌మన్‌లలో నికోలస్ పూరన్ (44; 27 బంతుల్లో 3x4, 2x6) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఫామ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (25) ధాటిగా ఆడాడు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (2/18), రాహుల్‌ చహర్‌ (2/26), జేమ్స్‌ పాటిన్సన్‌ (2/28) తలో రెండు వికెట్లు పడగొట్టారు.

మంచి శుభారంభమే అందినా:

మంచి శుభారంభమే అందినా:

భారీ లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్‌కు మయాంక్‌ అగర్వాల్ ‌(25) మంచి శుభారంభమే అందించాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో ఐదో ఓవర్‌ ఐదో బంతికే బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే కరుణ్‌ నాయర్‌ (0) కూడా కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. కాసేపటికే కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్ (17)‌ ఔటవడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. చహర్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ మొదటి బంతికే రాహుల్‌ బౌల్డ్‌ అయ్యాడు. టాప్‌ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ బౌల్డ్‌ కావడం విశేషం.

పూరన్‌ ఒక్కడే:

పూరన్‌ ఒక్కడే:

కీలక బ్యాట్స్‌మన్‌ పెవిలియన్‌ చేరడంతో మ్యాచ్‌పై ముంబై పట్టుబిగించింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు సంధించారు. దీంతో 10 ఓవర్లకు 72/3తో నిలిచిన పంజాబ్..‌ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. నికోలస్ పూరన్‌ ఒక్కడే ఫోర్లు, సిక్సర్లతో కాస్త వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. అర్ధశతకానికి చేరువలో వచ్చిన అతడు ప్యాటిన్సన్‌ బౌలింగ్‌లో వెనుదిరగడంతో పంజాబ్‌ ఆశలు వదులుకున్నది. చాలా సమయం క్రీజులో ఉన్న మాక్స్‌వెల్‌ ఆకట్టుకోలేకపోయాడు.18 బంతులాడి కేవలం 11 రన్స్‌ మాత్రమే చేసి నిరాశపరిచాడు. గౌతమ్ ‌(22 నాటౌట్‌; 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) చివర్లో బ్యాట్‌ ఝుళిపించాడు. దాంతో పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేయడంతో ఓటమి పాలైంది.

డికాక్ క్లీన్‌బౌల్డ్‌:

డికాక్ క్లీన్‌బౌల్డ్‌:

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. షెల్డన్ కాట్రెల్‌ వేసిన తొలి ఓవర్‌లో ఓపెనర్‌ క్వింటన్ డికాక్ ‌(0) క్లీన్‌బౌల్డ్‌ అవ్వగా.. ముంబై పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్‌ కోల్పోయింది. నాలుగో ఓవర్‌లో వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (10) అనవసర పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. దీంతో ముంబై 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆపై రోహిత్‌ శర్మతో జోడీ కట్టిన ఇషాన్‌ కిషన్ ‌(28; 32 బంతుల్లో 1x4, 1x6) తొలుత వికెట్‌ కాపాడుకునేందుకు నెమ్మదిగా ఆడాడు.

రోహిత్ హాఫ్ సెంచరీ:

రోహిత్ హాఫ్ సెంచరీ:

ఇక రెచ్చిపోవాలని కిషన్ ప్రయత్నించగా.. కృష్ణప్ప గౌతమ్‌ వేసిన 14వ ఓవర్‌ తొలి బంతికి భారీ షాట్‌ ఆడి బౌండరీ వద్ద కరున్‌ నాయర్‌ చేతికి చిక్కాడు. దీంతో 62 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. రోహిత్‌ శర్మ గేర్ మార్చి16వ ఓవర్‌లో ధాటిగా ఆడి 21 పరుగులు సాధించడంతో పాటు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే షమీ వేసిన తర్వాతి ఓవర్‌లో మరో భారీ షాట్‌ ఆడి బౌండరీ లైన్‌ వద్ద జేమ్స్‌ నీషమ్‌ చేతికి చిక్కాడు. దీంతో ముంబయి 124 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది.

పొలార్డ్‌ వీరవిహారం:

పొలార్డ్‌ వీరవిహారం:

రోహిత్‌ శర్మ పెవిలియన్‌ చేరడంతో స్కోరు వేగం కాస్త తగ్గింది. 18వ ఓవర్లో హార్దిక్‌ పాండ్యా సిక్స్‌, రెండు ఫోర్లు బాదడంతో 18 రన్స్‌ వచ్చాయి. ఆ తర్వాత షమీ వేసిన 19వ ఓవర్లో పాండ్యా ఒక ఫోర్‌ బాదగా.. కీరన్ పొలార్డ్‌ మూడు వరుస బౌండరీలు బాది 19 పరుగులు రాబట్టారు. ఇక గౌతం వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో రెండో బంతికి పాండ్యా సిక్స్‌ కొట్టాడు.. ఆఖరి మూడు బంతుల్లో పొలార్డ్‌ వరుసగా సిక్సర్లు బాది జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఐదో వికెట్‌కు ఈ జోడీ 23 బంతుల్లో 67 రన్స్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. పంజాబ్‌ బౌలర్లలో కాట్రెల్‌, షమీ, గౌతం తలో వికెట్‌ తీశారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, October 1, 2020, 23:37 [IST]
Other articles published on Oct 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X