Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వీర కన్నడిగుల మధ్య పోరు: అందరి కళ్లూ వారి మీదే: ముంచినా, తేల్చినా వారే?

KXIP vs RCB: Two Bangalore stars Mayank Agarwal and Devdutt Padikkal coming face to face

దుబాయ్: ఐపీఎల్-2020 సీజన్‌లో భాగంగా ఆరో మ్యాచ్ ఈ సాయంత్రం ఆరంభం కాబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌‌లోని దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30 గంటలకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ 13వ ఎడిషన్‌లో ఈ రెండు జట్లకూ ఇది రెండో మ్యాచ్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించిన ఊపులో ఉంది ఆర్సీబీ. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఇప్పటికే ఓ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఓటమిని చవి చూసింది.

రెండు జట్లలోనూ కన్నడిగులదే పైచేయి..

రెండు జట్లలోనూ కన్నడిగులదే పైచేయి..

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టులో కన్నడిగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కన్నడిగుడు కేఎల్ రాహుల్.. స్వయంగా కింగ్స్ ఎలెవెన్ జట్టుకు కేప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. వికెట్ కీపర్ కూడా. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టే కెపాసిటీ కేఎల్ రాహుల్‌కు ఉంది. ఈ టీమ్ కోచ్ అనిల్ కుంబ్లే కూడా కన్నడిగుడే. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో ఇప్పటికే ప్రూవ్ అయింది. ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌.. సూపర్ ఓవర్ దాకా వెళ్లిందంటే దానికి కారణం మయాంక్ అగర్వాల్. ఓపెనర్‌గా క్రీజ్‌లోకి వచ్చిన మయాంక్.. నాలుగు సిక్సులు.. ఏడు ఫోర్లతో అదరగొట్టాడు. 60 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అతనూ కన్నడిగుడే.

రాయల్ ఛాలెంజర్స్‌లో

రాయల్ ఛాలెంజర్స్‌లో

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లో పుట్టుకొచ్చిన న్యూ స్టార్ దేవదత్ పడ్డికల్ మీదే అందరి దృష్టీ నిలిచింది. తాను ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు దేవదత్. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 42 బంతుల్లో 56 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ అయినప్పటికీ.. ఎలాంటి బెరుకు కనపర్చ లేదు. స్వేచ్ఛగా ఆడాడు.. ఖచ్చితమైన షాట్లను కొట్టాడు. ఎదురుగా ఎలాంటి బౌలర్ ఉన్నా లెక్క చేయలేదు. అనుభవజ్ఙుడి తరహాలో బ్యాటింగ్ చేశాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరగబోయే మ్యాచ్‌లో దేవదత్ ఎలా ఆడబోతున్నాడనేది ఆసక్తి రేపుతోంది.

పక్కా ప్లానింగ్.. పక్కాగా ఎగ్జిక్యూషన్..

పక్కా ప్లానింగ్.. పక్కాగా ఎగ్జిక్యూషన్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి.. అనిశ్చితిగా ఉంటుంది. ఎప్పుడెలా ఆడుతుందో తెలియదు. చేతుల దాకా వచ్చిన మ్యాచ్‌ను పోగొట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు ఛాన్స్ ఇవ్వలేదు. ఎంత పకడ్బందీగా ప్లాన్‌ను రూపొందించుకుందో.. అంతే పకడ్బందీగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఒక స్థాయిలో విజయం వైపునకు దూసుకెళ్తోన్న హైదరాబాదీ టీమ్‌ను కట్టడి చేయగలిగింది. ఘన విజయాన్ని అందుకుంది.

వాళ్లు కుదరుకుంటే..

వాళ్లు కుదరుకుంటే..

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ రెండు జట్లకూ బ్యాటింగే బలం. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, అరోన్ ఫించ్, దేవదత్ పడ్డికల్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్‌లోనూ ఏ మాత్రం తీసిపారేయలేం. యజువేంద్ర చాహల్.. ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా వికెట్లను పడగొట్టే సత్తా ఉన్నవాడు. మొన్నటి మ్యాచ్‌లో ఇదే విషయాన్ని రుజువు చేసుకున్నాడు. పేస్ బౌలర్ క్రిస్ మోరిస్ అందుబాటులో లేకపోవడం కొంత ప్రతికూలతే. పంజాబ్‌ టీమ్‌ కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమవుజ్జీగా నిలుస్తోంది. కేఎల్ రాహుల్, క్రిస్‌గేల్, మయాంక్ అగర్వాల్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది.

Story first published: Thursday, September 24, 2020, 12:32 [IST]
Other articles published on Sep 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+