For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీసేనతో బిగ్‌ఫైట్: ఆ మైల్‌స్టోన్‌కు అతి చేరువగా కేఎల్ రాహుల్, డేల్ స్టెయిన్

KXIP vs RCB: Skipper KL Rahul just 2 runs away to surpass 2000 runs in the IPL
IPL 2020,KXIP vs RCB : KL Rahul Only 2 Runs Away To Reach 2000-Run Mark

దుబాయ్: ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈ సాయంత్రం ఆరంభం కాబోయే మ్యాచ్‌.. ఒకరిద్దరు క్రికెటర్లకు చిరకాలం గుర్తుండిపోయే అవకాశాలు ఉన్నాయి. కేరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆ క్రికెటర్లు.. వాటిని అందుకోగలుగుతారా? లేదా? అనేదే ఇక్కడ పాయింట్. అది తేలాలంటే.. సాయంత్రం దాకా ఆగక తప్పదు.

ఆర్సీబీ వర్సెస్ కింగ్స్

ఆర్సీబీ వర్సెస్ కింగ్స్

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్-2020 సీజన్‌లో ఆరో మ్యాచ్ దుబాయ్‌ వేదికగా ప్రారంభం కాబోతోంది. 13 ఎడిషన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఒక మ్యాచ్‌లో ఓటమి చవి చూసింది. సూపర్ ఓవర్ దాకా మ్యాచ్‌ను తీసుకెళ్లగలిగినప్పటికీ.. భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేక చతికిల పడింది. సూపర్ ఓవర్‌లో రెండు పరుగులు మాత్రమే సాధించిన తొలి మేజర్ టీమ్‌గా అవాంఛనీయ రికార్డును నెలకొల్పింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై పైచేయి సాధించిన ఊపుతో జోరు మీదుంది కోహ్లీసేన. మరో విజయాన్ని నమోదు చేయడానికి ఉవ్విళ్లూరుతోంది.. కదం తొక్కుతోంది.

రెండు వేల క్లబ్‌కు రెండు పరుగుల దూరంలో..

రెండు వేల క్లబ్‌కు రెండు పరుగుల దూరంలో..

ఈ మ్యాచ్‌తో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ కేప్టెన్ కేఎల్ రాహుల్.. ఓ మైలురాయిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండు పరుగులు చేస్తే చాలు.. 2000 క్లబ్‌లో చేరతాడు. చేయాల్సింది రెండు పరుగులే కాబట్టి.. దీనిపై అనుమానాలు అనవసరం. ఆ రెండు పరుగులూ చేసేస్తే.. ఐపీఎల్‌లో 2000 క్లబ్‌లో చేరిన 20వ భారతీయ క్రికెటర్ అవుతాడు. విదేశీ క్రికెటర్ల పేర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. అతని నంబర్.. 32.

రెండేళ్లుగా పంజాబ్ తరఫున

రెండేళ్లుగా పంజాబ్ తరఫున

ఇప్పటిదాకా ఐపీఎల్‌లో 68 మ్యాచ్‌లను ఆడాడు కేఎల్ రాహుల్. 41.62 అతని బ్యాటింగ్ యావరేజ్. స్ట్రయిక్ రేట్ మెరుగ్గా ఉంది. 137 స్ట్రయిక్ రేటును నమోదు చేశాడతను. కేఎల్ రాహుల్.. 2018లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్‌తో జట్టు కట్టాడు. ఈ టీమ్ తరఫున 28 మ్యాచ్‌లను ఆడాడు. 1252 పరుగులు చేశాడు. 2019లో అద్భుతంగా ఆడిన రాహుల్.. ఆ సీజన్‌లో సెంచరీ బాాదాడు. ఐపీఎల్‌లో అతని తొలి సెంచరీ అదే. బ్యాటింగ్ సగటు కూడా మెరుగుపర్చుకున్నాడు. ఆ సీజన్‌లో అతని బ్యాటింగ్ సగటు 53.90గా రికార్డయింది.

వంద వికెట్ల క్లబ్‌లో స్టెయిన్..

వంద వికెట్ల క్లబ్‌లో స్టెయిన్..

మరోవంక- ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ కూడా తనకంటూ ఓ మైల్‌స్టోన్‌ను అందుకోనున్నాడు. ఐపీఎల్‌లో వంద వికెట్లను పడగొట్టన బౌలర్ల జాబితాలో చేరడానికి మూడు వికెట్ల దూరంలో ఉన్నాడతను. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతోన్న స్టెయిన్‌కు ఐపీఎల్ ఫార్మట్‌లో మూడు వికెట్లను పడగొట్టడం కాస్త కష్టతరమే. ఉన్న నాలుగు ఓవర్లలో మూడు వికెట్లను పడగొట్టడం అంటే మాటలు కాదు. ఐపీఎల్‌లో వంద వికెట్ల మార్క్‌ను అందుకోవడానికి ఒకటి లేదా అంతకుమించిన మ్యాచ్‌లు అవసరం అయ్యే అవకాశాలు లేకపోలేదు.

Story first published: Thursday, September 24, 2020, 13:27 [IST]
Other articles published on Sep 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+