
ఉమేశ్ ఒక్కడే
బెంగళూరు యువ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసి స్టార్ అయ్యాడు. ఈ రోజు కూడా అతడు చెలరేగితే బెంగళూరుకు మంచి శుభారంభం దక్కనుంది. ఇక ఆరోన్ ఫించ్ కూడా గాడిలో పడితే ఎదురుండదు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ సత్తా చాటితే పరుగుల వరదే. శివం దూబె, జోష్ ఫిలిప్ప్ రూపంలో హిట్టర్లు ఉన్నారు. గత మ్యాచులో యుజ్వేంద్ర చహల్ అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నవదీప్ సైనీ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్నాడు. డేల్ స్టెయిన్ రాణిస్తున్నాడు. ఇక ఫామ్ అందుకోవాల్సిందల్లా ఉమేశ్ యాదవ్ ఒక్కడే.

గేల్‌కు అవకాశం
పంజాబ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉన్నా.. గత మ్యాచులో ఒక్క మయాంక్ అగర్వాల్ మినహా ఎవ్వరూ రాణించలేదు. కెప్టెన్ రాహుల్‌తో పాటు మ్యాక్స్‌వెల్ కూడా బ్యాట్ ఝులిపిస్తే పంజాబ్‌కు బోణీ విజయం సాధ్యమే. క్రిస్ గేల్ రూపంలో మంచి హిట్టర్ ఉన్నా.. డిల్లీతో మ్యాచ్‌లో అతడికి చోటుదక్కలేదు. పూరన్ దారుణంగా విఫలమవడంతో ఈ రోజు మ్యాచ్‌లో గేల్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు షమీ, కాట్రెల్, బిష్ణోయ్ రాణించారు. షమీ 4 ఓవర్లలో 15 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అయితే జోర్డాన్ మాత్రం భారీగా పరుగులిచ్చాడు.

ఆ నాలుగురిపైనే అంచనాలు
ఈ మ్యాచ్‌లోనూ బెంగళూరు తొలి మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలో దిగే అవకాశం ఉంది. పంజాబ్ మాత్రం పూరన్ బదులు గేల్‌ను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో సత్తా చాటిన పడిక్కల్, చహల్.. ఢిల్లీపై అద్భుతంగా ఆడిన మయాంక్, షమీ ఎలా రాణిస్తారో చూడాలి. ఈ మ్యాచులో ఈ నాలుగురిపైనే భారీ అంచనాలు ఉన్నాయి.

చెరో 12 విజయాలు
ఇప్పటి వరకూ బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య 24 మ్యాచ్‌లు జరిగాయి. అందులో చెరో 12 విజయాలు సాధించాయి. అయితే చివరగా జరిగిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో బెంగళూరుదే పైచేయి. 2014లో దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. రెండు జట్ల అత్యధిక స్కోరు చూస్తే.. పంజాబ్ 232 పరుగులు చేయగా, బెంగళూరు 226 పరుగులు చేసింది. హైదరాబాద్, బెంగళూరు ఆడిన దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు మ్యాచ్ జరగనుంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. అయితే 160-170 రన్స్ నమోదయ్యే అవకాశం ఉంది.

జట్లు అంచనా
బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఆరోన్ ఫించ్, దేవ్‌దత్ పడిక్కల్, ఏబీ డివిలియర్స్, జోష్ ఫిలిప్ప్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివం దూబె, నవదీప్ సైనీ, ఉమేశ్‌యాదవ్, డేల్ స్టెయిన్, యుజ్వేంద్ర చహల్.
పంజాబ్: లోకేశ్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, క్రిస్ గేల్, సర్ఫరాజ్ ఖాన్, గ్లెన్ మాక్స్‌వెల్, కృష్ణప్ప గౌతమ్, షెల్డన్ కాట్రెల్, ముజీబ్ ఉర్ రహ్మాన్, రవి బిష్ణోయ్, మహమ్మద్ షమీ.
KKR vs MI: ముంబైపై ఘోర పరాజయం.. కోల్‌కతా ఖాతాలో చెత్త రికార్డు!!


Click it and Unblock the Notifications












