మరో తప్పిదం: అశ్విన్ చేత ఓవర్‌కు 7 బంతులేయించిన అంఫైర్


హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2019 సీజన్‌లో అంఫైర్లు వరుస తప్పిదాలకు పాల్పడుతున్నారు. చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో ముగిసిన మ్యాచ్‌లో బెంగళూరు విజయానికి ఆఖరి బంతికి 7 పరుగులు అవసరమవగా.. ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ నోబాల్ విసిరిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
మలింగ నోబాల్‌గా విసిరినా ఫీల్డ్ అంపైర్ పసిగట్టలేకపోయాడు. దీంతో ముంబై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముగిశాక రీప్లేలో ఇది ఖరారైనా అప్పటికే ఆలస్యమైపోయింది. అంపైర్ల పొరపాటును బిగ్‌స్క్రీన్‌పై చూసిన కోహ్లీ.. ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. ప్రజంటేషన్ సమయంలో అంపైర్ల తప్పిదంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అంపైరింగ్‌లో మరో తప్పిదం
ఈ సంఘటన జరిగి రెండు రోజులు కూడా గడవకముందే మరో అంపైరింగ్ తప్పిదం కనిపించింది. టోర్నీలో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు మొహాలి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ తొలి ఓవర్‌లో ఏడు బంతులు వేశాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై
ముంబై ఇండియన్స్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగగా.. అశ్విన్ తొలి ఓవర్ వేశాడు. అశ్విన్ వేసిన మొదటి ఓవర్ తొలి బంతిని రోహిత్ పరుగులేమీ చేయకపోగా, రెండో బంతికి సింగిల్ తీశాడు. ఇక మూడో బంతి ఆడిన డీకాక్ పరుగులేమీ చేయలేదు. నాల్గో బంతికి డీకాక్ పరుగు తీయగా, రోహిత్ ఆడిన ఐదో బంతికి పరుగులేమీ రాలేదు.

ఆరో బంతికి సింగిల్ తీసిన రోహిత్
ఆరో బంతిని రోహిత్ సింగిల్ తీయడంతో ఓవర్ పూర్తయ్యింది. అయితే ఆ విషయాన్ని నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న అంపైర్ గమనించకపోవడంతో అశ్విన్ మరో బంతి వేశాడు. ఆ బంతిని డీకాక్ ఫోర్ కొట్టాడు. ఆరు బంతులతో ఓవర్ పూర్తయ్యే సరికి ముంబైకి మూడు పరుగులే రాగా, ఏడో బంతికి ఓవర్ పూర్తి కావడంతో ముంబై ఏడు పరుగులు చేసింది. అశ్విన్ వేసిన ఏడో బంతిని డీకాక్ ఫోర్‌గా మలిచాడు. అది ఏడో బంతిగా నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఇది మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపితే మాత్రం మరొకసారి అంపైర్లపై తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉంది.

అశ్విన్ వేసిన ఓవర్ ఇలా:
1st ball: డాట్ బాల్
2nd ball: సింగిల్
3rd ball: డాట్ బాల్
4th ball: సింగిల్
5th ball: డాట్ బాల్
6th ball: సింగిల్
7th ball: ఫోర్ బాదిన డీ కాక్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications