
సెహ్వాగ్ విమర్శల్లో తప్పులేదు..
సెహ్వాగ్ విమర్శలను తాను అర్థం చేసుకోగలనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.‘రూ.10 కోట్ల ఖరీదైన చీర్ లీడర్ అంటూ నాపైన కామెంట్ చేసిన సెహ్వాగ్‌పై ఎలాంటి కోపం లేదు. అతని విమర్శలను నేను అర్థం చేసుకోగలను. ప్రస్తుతం అతను మీడియాలో ఉన్నాడు. ఆటగాళ్ల వైఫల్యాలను విమర్శించే హక్కు అతనికి ఉంది. వాటిని ఎదుర్కోవడానికి నేను సిద్దంగా ఉన్నా. ఆ కామెంట్స్‌ను పట్టించుకోకుండా ముందుకు సాగుతా. నా ఆటను మెరుగుపర్చుకునేందుకు ఉత్ప్రేరకంగా ఉపయోగించుకుంటా'అని మ్యాక్సీ చెప్పుకొచ్చాడు.

నాకు కొత్తకాదు..
ఇక ఇలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం తనకు కొత్త కాదని మ్యాక్సీ తెలిపాడు. ఇలాంటివి ఎన్నో ఎదుర్కోన్నానని చెప్పుకొచ్చాడు. ‘ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం నాకు కొత్తకాదు. గతంలో కొంత మానసికంగా కుంగిపోయినా ఇప్పుడు బాగానే ఉన్నా.'అని తెలిపాడు. ఇక మానసిక సమస్యతో బాధపడిన మ్యాక్సీ కొన్నాళ్లు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. బిగ్ బాష్ లీగ్‌తో పునరాగమనం చేయాలనుకున్నాడు. కానీ కరోనా లీగ్ ఆగిపోవడంతో ఐపీఎల్ బరిలోకి దిగాడు. ప్రస్తుతం భారత్‌తో జరిగే లిమిటెడ్ ఓవర్ల సిరీస్ ఆడనున్నాడు.

రూ. 10 కోట్ల ఖరీదైన చీర్ లీడర్..
ఐపీఎల్ 2020 సీజన్లో విఫలమైన ఆటగాళ్లపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరోన్ ఫించ్, ఆండ్రూ రస్సెల్, మాక్స్వెల్, షేన్ వాట్సన్, డేల్ స్టెయిన్ వైఫల్యాలపై వీరూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గ్లెన్ మాక్స్వెల్.. పంజాబ్ జట్టులో రూ.10 కోట్ల ఖరీదైన చీర్లీడర్. లీగ్‌లో గత కొన్ని సీజన్లుగా తన ప్రదర్శన పేలవంగా కొనసాగుతోంది. అయితే ఈ సారి ఆ రికార్డులు కూడా బద్దలు కొట్టి మరింత విఫలమయ్యాడు. ఇది అతనికి అత్యంత ఖరీదైన విహారయాత్రగా భావించవచ్చు.'అని ఘాటుగా విమర్శించాడు.
IPL 2021కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆ ఇద్దర్నీ రిటైన్ చేసుకోవాలి!