కోహ్లీనే నంబర్‌వన్: 13 ఏళ్ల తర్వాత అగ్రస్థానంలో ఓ ఆసీస్ బౌలర్


హైదరాబాద్: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఆదివారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో 992 రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. కేన్ విలియమ్సన్ (897) రెండో స్థానంలో కొనసాగుతుండగా... భారత ఆటగాడు చతేశ్వర్ పుజారా (881) మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ, పుజారా మినహా.. బ్యాటింగ్ టాప్-10లో భారత క్రికెటర్లెవ్వరికీ చోటు దక్కలేదు. స్టీవ్ స్మిత్ (857), హెన్నీ నికోలస్ (763) నాలుగు, ఐదు స్థానాల్లో చోటు దక్కించుకున్నారు.

అత్యుత్తమ ర్యాంకుకి పెరీరా
శ్రీలంక బ్యాట్స్‌మన్ పెరీరా కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. డర్బన్ టెస్ట్‌లో చారిత్రక ప్రదర్శన చేసిన శ్రీలంక మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కుశాల్ పెరీరా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 58 స్థానాలు ఎగబాకి 40వ ర్యాంకు సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో 51, 153 నాటౌట్ పరుగులతో చెలరేగడంతో పెరెరా తన ర్యాంకుని మెరుగుపరచుకున్నాడు.

13 ఏళ్ల తర్వాత అగ్రస్థానంలో ఆసీస్ బౌలర్
టెస్టు బౌలర్ల జాబితాలో సఫారీ పేసర్ రబాడను వెనక్కి నెట్టి ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. ప్యాట్ కమిన్స్ (878 రేటింగ్ పాయింట్లు) తొలిసారిగా నంబర్‌వన్ ర్యాంకుని అందుకున్నాడు. దీంతో 13 ఏళ్ల తర్వాత ఆసీస్ బౌలర్ అగ్రస్థానానికి చేరడం ఇదే ప్రథమం. చివరిసారి 2006లో ఆసీస్ నుంచి గ్లెన్ మెక్‌గ్రాత్ ఈ ఘనత సాధించాడు.

మూడో స్థానానికి పడిపోయిన సఫారీ పేసర్ రబాడ
శ్రీలంకతో ముగిసిన తొలి టెస్టులో 3 వికెట్లే తీసిన దక్షిణాఫ్రికా పేసర్ రబాడ (849) మూడో స్థానానికి పడిపోగా, ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్ (862) రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. ఈ జాబితాలో భారత్ తరఫున స్పిన్నర్లు రవీంద్ర జడేజా (5), అశ్విన్ (10) మాత్రమే టాప్-10లో కొనసాగుతుండగా, బుమ్రా 16వ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా మూడో ర్యాంక్‌లో ఉండగా, జాసన్ హోల్డర్, షకీబ్ తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications