ధోనీని గుర్తుచేసిన యంగ్ వికెట్ కీపర్.. ఒక్క రనౌట్ మ్యాచ్ ఫలితం మారిపోయింది!
ప్రపంచ క్రికెట్‌లో బెస్ట్ వికెట్ కీపర్ ఎవరు? అంటే చటుక్కున అందరికీ గుర్తొచ్చే పేరు ఎంఎస్ ధోనీ. ఈ భారత మాజీ కెప్టెన్ వికెట్ల వెనుక ఎన్నో విన్యాసాలు చేశాడు. కనీసం వికెట్లు ఎక్కడ ఉన్నాయో చూడకుండా రనౌట్‌లు చేశాడు. అందుకే అతన్ని బెస్ట్ వికెట్ కీపర్ అని చెప్తారు. తాజాగా మరో వికెట్ కీపర్ అలాంటి విన్యాసమే చేశాడు.
లంక ప్రీమియర్ లీగ్‌లో దంబుల్లా ఆరా, గాలె టైటాన్స్ మధ్య మ్యాచ్‌లో ధోనీ వికెట్ కీపింగ్ స్కిల్స్‌ను అందరూ గుర్తుచేసుకున్నారు. ఎందుకంటే లంక స్టార్ కుశాల్ మెండిస్.. ధోనీ తరహాలో రనౌట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కుశాల్ ఫీట్ చూసిన అందరూ ధోనీని గుర్తు చేశాడంటూ మెచ్చుకుంటున్నారు.

ఈ మ్యాచ్‌లో ఛేజింగ్ చేస్తున్న గాలె టైటాన్స్.. చివరి ఓవర్ ఆడుతోంది. ఈ సమయంలో వికెట్ కీపింగ్ చేస్తున్న దంబుల్ల ప్లేయర్ కుశాల్ మెండిస్.. మెరుపు వేగంతో రనౌట్ చేశాడు. ఫుల్ టాస్ బాల్ ఎదుర్కొన్న లాహిరు సమరకూన్ రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో మెండిస్ అద్భుతమైన కీపింగ్ స్కిల్స్ వల్ల రనౌట్ అయ్యాడు.
ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న వెంటనే.. చటుక్కున అండర్ ఆర్మ్ త్రో విసిరాడీ లంక ప్లేయర్. ఆ బంతి వికెట్లను తాకే సమయానికి లాహిరు సమరకూన్.. క్రీజును చేరుకోలేకపోయాడు. వికెట్లకు పక్కగా ఉన్న కుశాల్ మెండిస్.. అంత కరెక్ట్‌గా వాటిని కూల్చడం అంత ఈజీ కాదు. అందుకే అందరూ అతన్ని ఫీట్‌ను ధోనీ వికెట్ కీపింగ్‌తో పోలుస్తూ మెచ్చుకుంటున్నారు.
Wayward throw? No worries.
— FanCode (@FanCode) August 12, 2023
Mendis got you covered 😎 in a Dhoni-esque manner 🧤#LPL2023 #LPLonFanCode pic.twitter.com/RvXpRibdN9
ఇలా కుశాల్ తెలివిగా వికెట్ కీపింగ్ చేయడంతో.. దంబుల్లా టీం ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. ధోనీ ఆడే సమయంలోనే వికెట్ కీపింగ్‌తో మ్యాచ్ ఫలితాన్ని మార్చడం చూశామని, మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్లకు అలాంటి దృశ్యం చూస్తున్నామని మెచ్చుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications