న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కుశాల్ మెండిస్‌కు బెయిల్.. పోలీసు కస్టడీలో ఒకే రోజు!!

Kusal Mendis released on bail day after arrest for role in fatal road accident

కొలంబో: 64 ఏళ్ల వృద్ధుడిని కారుతో ఢీకొట్టిన కేసులో శ్రీలంక క్రికెటర్ కుశాల్ మెండిస్‌కు బెయిలు మంజూరయింది. శనివారం మద్యం సేవించి కారు నడిపిన కుశాల్.. ఓ వృద్ధుడి మృతికి కారణమయ్యాడు. దాంతో అరెస్ట్ చేసిన పోలీసులు మెజిస్ట్రేట్ అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించారు. అయితే కుశాల్ మెండిస్‌కి ఈరోజు బెయిల్ మంజూరయింది. దీంతో ఒక్క రోజు మాత్రమే పోలీసు కస్టడీలో అతడు ఉన్నాడు. సెప్టెంబరు 9న కోర్టుకి కుశాల్ హాజరుకానున్నట్లు సమాచారం.

కరోనా ఎక్కడికి పోదు.. వైరస్‌తో కలిసి మనం జీవించాల్సిందే: గంగూలీకరోనా ఎక్కడికి పోదు.. వైరస్‌తో కలిసి మనం జీవించాల్సిందే: గంగూలీ

శ్రీలంకలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్ నిబంధనల్ని పూర్తిగా ఎత్తివేశారు. వివాహాలు, పంక్షన్లకి లంక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత శనివారం శ్రీలంక క్రికెట్ బోర్డులోని ఓ ఉద్యోగి వివాహం జరిగింది. ఆ వివాహానికి కుశాల్ మెండిస్‌తో పాటు చాలా మంది శ్రీలంక క్రికెటర్లు వెళ్లారు. వివాహం అనంతరం కుశాల్ తన ఎస్‌యూవీ కారులో తిరుగు ప్రయాణం అయ్యాడు.

కొలంబోలోని పాండ్వారా రోడ్డుపై కుశాల్ మెండిస్‌ ప్రయాణిస్తుండగా.. అతని కారు ఓ సైకిల్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఆగని కుశాల్.. కారుతో సహా పరారయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 64 ఏళ్ల వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో కుశాల్‌పై హిట్ అండ్ రన్ కేసు నమోదయింది. పోలీసులు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి వివరాలు సేకరించారు.

కుశాల్ మెండిస్‌ నడిపిన కారు.. సైకిల్‌పై వెళ్తున్న వృద్ధుడ్ని ఢీకొని అనంతరం రోడ్డు పక్కన ఉన్న గోడని ఢీకొట్టినట్లు సీసీ కెమెరా పుటేజీలో తేలింది. దీంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు మెజిస్ట్రేట్ అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించారు. మరోవైపు కారు నడిపిన సమయంలో కుశాల్ మెండిస్ మద్యం సేవించి ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు శ్రీలంక మీడియా స్పష్టం చేసింది.

ఈ కేసు విచారణ సమయంలో పనాదురా అడిషనల్ మేజిస్ట్రేట్ కుశాల్‌కు బెయలు మంజూరు చేశారు. దీనికోసం రూ.4లక్షల విలువైన రెండు ఆస్తులను పూచికత్తుగా ఉంచాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. అలాగే మృతుడి కుటుంబానికి కూడా రూ.4లక్షలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పారు. సెప్టెంబరు 9న కోర్టుకి కుశాల్ హాజరుకానున్నట్లు తెలిసింది.

Story first published: Tuesday, July 7, 2020, 14:00 [IST]
Other articles published on Jul 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X