Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుంబ్లే గెలవడం నేర్పిస్తాడు, ఇక మీదే: టెండుల్కర్

ముంబై: క్లిష్ట సమయాల్లో ఎలా గెలవాలో భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే నేర్పుతారని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ధీమా వ్యక్తం చేశాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్లో మమేకమైన కుంబ్లే నుంచి నేటి యువత ఎంతైనా నేర్చుకోవచ్చునని చెప్పాడు.

జట్టు ఎలా శ్రమిస్తే గెలుస్తుందో కుంబ్లే నేర్పిస్తాడని చెప్పాడు. ఈ విషయంలో తనకు ఎలాంటి అనుమానం లేదన్నాడు. మ్యాచ్‌ల్లో నిర్ణయాత్మక సందర్భాలు ఎదురైనపుడు వాటిని ఎలా ఒడిసిపట్టి విజయాలు సాధించాలో కుంబ్లేకు తెలుసునని చెప్పాడు.

Kumble will teach India to deal with 'tough moments': Tendulkar

కుంబ్లే గొప్ప పోరాటతత్వం ఉన్నవాడని, మైదానంలో ఏమాత్రం రాజీ పడడని, ప్రతి సందర్భంలోనూ గెలిచి తీరాలనే దృఢచిత్తంతో బరిలోకి దిగుతాడని, అతను నేర్చుకున్నదంతా యువ ఆటగాళ్లకు చెబుతాడన్నాడు.

అతడి నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలని క్రికెటర్లకు సూచించాడు. కుంబ్లేతో తన అనుభవం అద్బుతమని చెప్పాడు. అతను మ్యాచ్ విన్నర్ అని కితాబిచ్చాడు. అతని నుంచి ఎంత సాధ్యమైతే అంత తెలుసుకోవాలని సూచించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+