లక్ష్మణ్ పై కుంబ్లే ప్రశంసల జల్లు
న్యూఢిల్లీ: పాకిస్తానుపై తొలి టెస్టు విజయంలో ప్రతి ఒక్క భారత ఆటగాడు పాలు పంచుకున్నాడని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే ప్రశంసించారు. ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి ఒక్కరూ ఆటలో లీనమయ్యారని ఆయన అన్నారు. గంగూలీ బౌలింగ్ కూడా బాగా చేశాడని, బ్యాటింగ్ చాలా కష్టంగా ఉండిందని, అయినా అందరూ బాగా ఆడారని ఆయన అన్నారు. తాను గత రాత్రి బాగా నిద్రపోయానని, భూకంపం వచ్చిన విషయం కూడా తనకు తెలియలేదని, ఈ రోజు 32 పరుగులు చేయడం కష్టమైన విషయం కాదనే విషయం తనకు తెలుసునని ఆయన అన్నారు.వివియస్ లక్ష్మణ్ ను కుంబ్లే ప్రత్యేకంగా కొనియాడాడు. తొలి ఇన్నింగ్సులో లక్ష్మణ్ చేసిన 72 పరుగులు అత్యంత కీలకమైనవని రుజువైందని ఆయన అన్నారు. లక్ష్మణ్ అద్భుతమైన ఆటగాడని, లక్ష్మణ్ మెడపై ఎల్లవేళలా కత్తి ఎందుకు వేలాడుతుందో తనకు అర్థం కావడం లేదని, ధోనీతో కలిసి లక్ష్మణ్ చేసిన పరుగులు కీలకపాత్ర పోషించాయని, దాని వల్లనే ఆటపై తమకు పూర్తి పట్టు లభించిందని ఆయన అన్నారు. ఫిరోజా షా కోట్ల మైదానంలో కెప్టెనుగా తనకు తొలి విజయం లభించడం ప్రత్యేకమైందని ఆయన అన్నారు. గతానికి సంబంధించిన ఆటతీరును చూసినా ఫిరోజా షా కోట్లా మైదానంలో తాను బాగా ఆడినట్లు తెలిసిపోతుందని, ఇది తనకు సానుకూలమైన భావనను, వాతావరణాన్ని అందిస్తుందని, అండర్ -19 నుంచి తనకు ఈ మైదానం కలిసి వస్తోందని ఆయన అన్నారు. దినేష్ కార్తిక్ ఫీల్డింగు ద్వారా విజయానికి తోడ్పడ్డాడని ఆయన చెప్పారు.
Story first published: Monday, November 26, 2007, 23:53 [IST]
Other articles published on Nov 26, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications