Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోచ్‌గా కుంబ్లే నిష్క్రమణ: అసలేం జరిగింది?

హైదరాబాద్: ప్రపంచ క్రికెట్‌లో ఆటగాడిగా అనిల్ కుంబ్లేది 17 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. ఏడాది కిందట టీమిండియా కోచ్‌గా అనిల్ కుంబ్లే ఎంపికైనప్పుడు ఆ పదవిలో దీర్ఘకాలం కొనసాగుతాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా అనిల్ కుంబ్లే ఏడాదికే కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు.

గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్టే కెప్టెన్ కోహ్లీతో విభేదాలే కుంబ్లే నిష్క్రమణకు కారణమైంది. ఇదే విషయాన్ని అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. వెస్టిండిస్ పర్యనటకూ కోచ్‌గా కొనసాగాలని బోర్డు కుంబ్లేని కోరినప్పటికీ... కుంబ్లే మాత్రం తక్షణం కోచ్‌గా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.

తనకు పదవిలో కొనసాగే ఉద్దేశం లేదని బోర్డుకు స్పష్టం చేశాడు. కోచ్‌గా తన పద్ధతులపై కెప్టెన్‌కు అభ్యంతరాలున్నట్లుగా బోర్డు తనకు తెలిపిన నేపథ్యంలో తానీ నిర్ణయం తీసుకుంటున్నట్లు కుంబ్లే మంగళవారం స్పష్టం చేస్తూ తన పదవికి రాజీనామా చేశాడు. మరో మూడు రోజుల్లో విండీస్ పర్యటన ప్రారంభంకానున్న నేపథ్యంలో కుంబ్లే ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలేంటో తెలియాల్సి ఉంది.

కుంబ్లే రాజీనామాను బోర్డు కూడా ధ్రువీకరించింది. 'కుంబ్లే కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నట్లు ధ్రువీకరిస్తున్నాం. కోచ్‌గా కొనసాగాలని క్రికెట్‌ సలహా కమిటీ కోరినప్పటికీ కుంబ్లే అంగీకరించలేదు. భారత జట్టు మళ్లీ టెస్టుల్లో నెంబర్ వన్ జట్టుగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన కుంబ్లేకు అభినందనలు. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలు అమోఘం. భవిష్యత్తులో కుంబ్లేకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం' అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

ఏడాది కిందట రవిశాస్త్రిని కాదని ప్రధాన కోచ్ పదవి చేపట్టిన కుంబ్లే.. వరుస విజయాలతో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపాడు. అయితే ఆట పరంగా అత్యున్నత స్థాయిలో ఉన్నా.. ఆటగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించడంతో విరాట్‌ కోహ్లీతో పాటు కొంత మంది సీనియర్ ఆటగాళ్లు కుంబ్లే తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారు.

కెప్టెన్, కోచ్‌ల మధ్య భేదాభిప్రాయాలు

కెప్టెన్, కోచ్‌ల మధ్య భేదాభిప్రాయాలు

ఈ క్రమంలో కెప్టెన్, కోచ్‌ల మధ్య భేదాభిప్రాయాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో కోహ్లీ నేరుగా బోర్డుకు ఫిర్యాదు చేశాడు. కోచ్‌ను తప్పించకపోతే కొనసాగడం కష్టమని ఓ దశలో అల్టిమేటం కూడా జారీ చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాల్లో ఉండగానే బీసీసీఐ హడావుడిగా కొత్త కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది.

సీఓఏ జోక్యం

సీఓఏ జోక్యం

అయితే దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడం, పరిపాలన కమిటీ (సీఓఏ) జోక్యం చేసుకోవడంతో సమస్యను పరిష్కరించే బాధ్యతను క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ)కి అప్పగించారు. ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న సమయంలో లండన్‌లో ఉన్న ఈ ముగ్గురు పలు దఫాలుగా ఆటగాళ్లు, కోహ్లీ, కుంబ్లేతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు.

కుంబ్లేతో కలిసి పని చేయడం సాధ్యం కాదు

కుంబ్లేతో కలిసి పని చేయడం సాధ్యం కాదు

కుంబ్లే కొనసాగాలని కోరుకుంటున్న ఈ కమిటీ.. కోహ్లీకి సర్దిచెప్పేందుకు ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు ముందు అతడితో సమావేశం నిర్వహించింది. అయితే కుంబ్లేతో కలిసి పని చేయడం సాధ్యం కాదని కోహ్లి స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. కోచ్‌గా కొనసాగాలని కుంబ్లేను కమిటీ కోరినప్పటికీ, అతను మాత్రం తప్పుకోవడానికి నిర్ణయించుకున్నాడు.

మంగళవారం బోర్డుకు రాజీనామా లేఖ

మంగళవారం బోర్డుకు రాజీనామా లేఖ

ఈ క్రమంలో మంగళవారం తన రాజీనామాను బోర్డుకు పంపించాడు. 'సోమవారం నేను బీసీసీఐ నుంచి ఓ సమాచారం అందుకున్నాను. ప్రధాన కోచ్‌గా కొనసాగాలంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించిన విధంగా జట్టు శిక్షణలో కొన్ని మినహాయింపులు పాటించాలని కోరింది. జట్టు కెప్టెన్‌తో గౌరవంగా మెలుగడంలో కోచ్‌గా నా పరిధి మేరకు ప్రవర్తించడం తెలుసు' అని అందులో పేర్కొన్నాడు.

తప్పుకోవడమే మేలని అనిపించింది

తప్పుకోవడమే మేలని అనిపించింది

'అందుకే బీసీసీఐ నుంచి వచ్చిన సూచన నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కెప్టెన్‌కు నాకు మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు బీసీసీఐ పూర్తిస్థాయిలో ప్రయత్నించినా మా ఇద్దరి భాగస్వామ్యం అసంపూర్ణంగా ముగిసింది. దీంతో తప్పుకోవడమే మేలనిపించి ఈ నిర్ణయం తీసుకున్నాను' అని రాజీనామా లేఖలో కుంబ్లే పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+