Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుంబ్లేకు ఐదు వికెట్లు: హెడెన్ సెంచరీ

Anil Kumble
మెల్బోర్న్: భారత జట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే ధాటికి ఆస్ట్రేలియా బ్యాటింగ్ దూకుడుకు అడ్డుకట్ట పడింది. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్సును ఆస్ట్రేలియా ధాటిగానే ప్రారంభించినప్పిటికీ దాన్ని చివరంటా కొనసాగించలేకపోయింది. కుంబ్లే ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఒక ఇన్నింగ్సులో కుంబ్లే ఐదు వికెట్లు తీసుకోవడం ఇది 35వ సారి. మాథ్యూ హెడెన్, జాక్స్ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సును ధాటిగానే ప్రారంభించారు. హెడెన్ మరోసారి బ్యాటింగులో తన సత్తా చాటుకున్నాడు. హెడెన్ 125 పరుగులు చేసి జహీర్ ఖాన్ బౌలింగులో అవుటయ్యాడు. జాక్స్ 66 పరుగులు చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 337 పరుకుగులు చేసింది. జాన్సన్ పది పరుగులతోనూ క్లార్క్ 21 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.

ఆ తర్వాత ఏ బ్యాట్స్ మన్ కూడా నిలదొక్కుకోలేకపోయాడు. ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ జహీర్ బౌలింగులో నాలుగు పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. అంతకుముందు టీం ఇండియా కెప్టెన్ అనిల్ కుంబ్లే స్పిన్ మాయాజాలానికి ఆసీస్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. అనిల్ కుంబ్లే బౌలింగ్‌లో 66 పరుగుల వ్యక్తిగత స్కొరువద్ద ఓపెనర్ జాక్వస్ అవుటవ్వడంతో ఆసీస్ తన తొలి వికెట్ కోల్పొయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రికీ పాంటింగ్‌ (4) నిలదొక్కుకోక ముందే జహీర్‌ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం హసీ ‌(0)ని కూడా కుంబ్లేకు వికెట్ల ముందు దొరికిపోయి పెవీలియన్ దారి పట్టాడు. హసీ తర్వాత క్లార్క్(20)వచ్చిన వెంటనే పరుగుల వేట ప్రారంభించినా ఆర్పీసింగ్ బౌలింగ్‌లో లక్ష్మణ్ క్యాచ్ ద్వారా త్వరగానే పెవిలియన్‌కు చేరాడు. సైమండ్స్ 35 పరుగులకు, గిల్ క్రిస్ట్ 23 పరుగులకు కుంబ్లే బౌలింగులో పెవిలియన్ దారి పట్టారు. ఆ తర్వాత హాగ్ ను జహీర్ అవుట్ చేశాడు. హాగ్ 18 పరుగులు చేశాడు. బ్రెట్ లీ కుంబ్లే బౌలింగులో డకవుట్ అయ్యాడు. కుంబ్లేకు ఐదు వికెట్లు, జహీర్ ఖాన్ కు 3 వికెట్లు లభించాయి. ఆర్పీ సింగ్ ఒక్క వికెట్ లభించింది.
Story first published: Wednesday, December 26, 2007, 23:53 [IST]
Other articles published on Dec 26, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+