అహ్మదాబాద్: దక్షిణాఫ్రికాతో ఈ నెల 11వ తేదీ నుంచి కాన్పూర్ లో జరిగే మూడోది, చివరిది అయిన టెస్టు మ్యాచుకు భారత క్రికెట్ జట్టులో మార్పులు సంభవించాయి. రెండో టెస్టులో ఘోరమైన ఓటమి పొందడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సెలెక్షన్ కమిటీ జట్టులో మార్పులు చేసింది. ఫాస్ట్ బౌలింగ్ విఫలం కావడంతో ఆర్పీ సింగ్ కు విశ్రాంతి కల్పించారు. ఆర్పీ సింగ్ స్థానంలో మునాఫ్ పటేల్ కు స్థానం కల్పించారు. గాయాల పాలైన అనిల్ కుంబ్లే, ఇషాంత్ శర్మలకు ఈ నెల పదవ తేదీన ఫిట్నెస్ పరీక్షలు జరుగుతాయి. మూడో టెస్టు మ్యాచుకు కుంబ్లే దూరమయ్యే అవకాశాలే ఎక్కువని భావిస్తున్నారు. కుంబ్లే స్థానంలో రమేష్ పొవార్ మైదానంలోకి దిగవచ్చు. మూడో టెస్టుకు పొవార్ ను ఎంపిక చేశారు.
జట్టు: అనిల్ కుంబ్లే (కెప్టెన్), వీరేందర్ సెహ్వాగ్, వాసిం జాఫర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వివియస్ లక్ష్మణ్, ఎంఎస్ ధోనీ, హర్భజన్ సింగ్, ఎస్ శ్రీశాంత్, ఇర్పాన్ పఠాన్, యువరాజ్ సింగ్, పియూష్ చావ్లా, మొహ్మద్ కైఫ్, ఇషాంత్ శర్మ, మునాఫ్ పటేల్, రమేష్ పొవార్.