ధోనీ.. వచ్చే సీజన్‌ ముందైనా కాంపిటీటివ్ క్రికెట్ ఆడు: సంగక్కర అడ్వైజ్

దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. వరుస పరాజయాలతో అందరికన్నా ముందే చెన్నై ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇక ఏడాది తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన మహీ.. ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాడు. కీపింగ్‌లో అదరగొట్టిన బ్యాటింగ్‌లో దారుణంగా విఫలయ్యాడు.

అతని కెప్టెన్సీలో కూడా మునపటి మార్క్ కనిపించలేదు. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఘోరంగా విఫలమై చెన్నై ఇంటి బాట పట్టింది. అయితే ఐపీఎల్ 2021 సీజన్‌‌కైనా ధోనీ ప్రిపెరై రావాలని శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర సూచించాడు. స్టార్ స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడుతూ.. వచ్చే సీజన్ ముందు ధోనీ కాంపిటీటివ్ క్రికెట్ ఆడి తన ఫామ్ అందుకోవాలని సలహా ఇచ్చాడు.

కాంపిటీటివ్ క్రికెట్ ఆడాలి..

కాంపిటీటివ్ క్రికెట్ ఆడాలి..

‘వ్యక్తిగత ప్రదర్శన పట్ల ధోనీ తీవ్ర నిరాశకు గురై ఉంటాడు. అయితే మిగిలిన ఒక్క మ్యాచ్‌తో అతనేం చేయలేడు. కనీసం తదుపరి సీజన్‌కైనా తన తప్పిదాలను తెలుసుకొని రావాలి. అయితే అంతర్జాతీయ క్రికెట్‌, ఫస్ట్ క్లాస్, ప్రాంతీయ క్రికెట్ ఆడకుండా నేరుగా ఐపీఎల్‌లో ఆడుదామంటే కుదరదు. ఫామ్ అందుకోవాలంటే అతను వచ్చే సీజన్ ముందు కాంపిటీటివ్ క్రికెట్ ఆడాలి.'అని ఈ శ్రీలంక మాజీ వికెట్ కీపర్ సూచించాడు.

ధోనీ ఆడాలనే ఆకలితో ఉన్నాడు..

ధోనీ ఆడాలనే ఆకలితో ఉన్నాడు..

ఇక ధోనీ మంచి క్రికెట్ ఆడాలనే ఆకలితో ఉన్నాడని సంగక్కర చెప్పుకొచ్చాడు. అదే అతన్ని మెరుగయ్యేలా చేస్తుందని అభిప్రాయపడ్డాడు. ‘ధోనీ మంచి క్రికెట్ ఆడాలనే ఆకలితో ఉన్నాడని ఖచ్చితంగా చెప్పగలను. నాకు తెలిసినంత వరకు ధోనీ వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయానికి కావాల్సిన పరుగులు చేస్తేనే సంతోషపడుతాడు. ఎప్పుడూ అలానే ఆలోచిస్తుంటాడు. తన జట్టు విజయానికి కావాల్సిన 10 పరుగులు చేసినా ధోనీ ఎంతో సంతోషంగా ఫీలవుతాడు'అని సంగక్కర చెప్పుకొచ్చాడు.

ఒక్క చెత్త ప్రదర్శనతో అంతం కాదు..

ఒక్క చెత్త ప్రదర్శనతో అంతం కాదు..

ఇక ఏ ఆటగాడికైనా మంచి, చెడు రోజులు ఉంటాయని, ఒక్క చెత్త ప్రదర్శనతో అంతమయ్యేదేం ఉండదన్నాడు. ఇక్కడ ధోనీ, సీఎస్‌కే కూడా అంతేనని, ఈ సీజన్‌లో విఫలమైనంత మాత్రానా జరిగే నష్టం ఏం లేదన్నాడు. వచ్చే సీజన్‌లో తప్పిదాలు సవరించుకొని బరిలోకి దిగుతారని తెలిపాడు. ‘ఈ సీజన్‌లో ధోనీ, సీఎస్‌కేకు కలిసి రాలేదు. అంత మాత్రానా అతన్ని ఆ జట్టును తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు'అని సంగక్కర ముగించాడు.

ఈ సర్జరీగాడా సాయం చేసేది.. షేన్ వార్న్‌పై శ్యామ్యూల్స్ అసభ్యకర కామెంట్స్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Friday, October 30, 2020, 18:35 [IST]
Other articles published on Oct 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X