గోల్డెన్ డక్ అయితే తప్పేంటి? బుడ్డోడికి కోచ్ స్వీట్ వార్నింగ్!
రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్, కేవలం 15 ఏళ్లకే ఐపీఎల్ సంచలనంగా మారిన కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై ఆ జట్టు హెడ్ కోచ్ కుమార సంగక్కర ప్రశంసలు కురిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన గత మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తొలి బంతికే ఔట్ అయ్యి వెనుదిరగడంతో సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై సంగక్కర స్పందించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరగనున్న కీలక పోరుకు ముందు రాజస్థాన్ రాయల్స్ యువ ప్లేయర్‌లో ధైర్యాన్ని నింపుతూ.. వైభవ్‌పై ఎలాంటి అదనపు ఒత్తిడి ఉండకూడదని స్పష్టం చేశాడు.
విఫలం కావడానికి కూడా నీకు హక్కు ఉంది!
సంగక్కర తన సందేశంలో వైభవ్‌కు ఓ విలువైన పాఠాన్ని నేర్పాడు. "వైభవ్‌కు నేను ఇచ్చే మెసేజ్ ఒక్కటే.. నువ్వు ఆటను మనస్ఫూర్తిగా ఆస్వాదించు. నువ్వు 35 బంతుల్లో సెంచరీ చేసినా లేదా మొదటి బంతికే ఔట్ అయినా అది క్రికెట్‌లో భాగమే. మైదానంలో పరుగులు చేయడానికి నీకు ఎంత హక్కు ఉందో, విఫలం కావడానికి కూడా అంతే హక్కు ఉంది. ఈ రెండింటినీ సమానంగా స్వీకరించినప్పుడే నువ్వు గొప్ప ఆటగాడివి అవుతావు" అని పేర్కొన్నాడు. కేవలం వయసును మాత్రమే చూడకుండా.. నెట్స్‌లో వైభవ్ పడే శ్రమను, మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకునే అతని పరిణతిని కోచ్ కొనియాడాడు.

దూకుడైన ఆటే వైభవ్ సూర్యవంశీ బలం
నేటి టీ20 క్రికెట్‌లో ఓపెనర్లుగా వచ్చే వారు మొదటి బంతి నుంచే ఎదురుదాడి చేయాల్సి ఉంటుందని.. ఇలాంటి హై-రిస్క్ గేమ్ ఆడేటప్పుడు అప్పుడప్పుడు డకౌట్ అవ్వడం సహజమని సంగక్కర చెప్పుకొచ్చాడు. వైభవ్ తన అనుభవంతో కొత్త విషయాలను నేర్చుకుంటాడని.. ఇలాంటి అసాధారణ టాలెంట్ ఉన్న ఆటగాళ్ల విషయంలో కోచ్‌లు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఆయన అభిప్రాయపడ్డాడు. వైభవ్ సూర్యవంశీ తన సహజ సిద్ధమైన శైలిని కోల్పోకూడదని, 15 ఏళ్ల కుర్రాడిలాగే మైదానంలోకి వెళ్లి ఆశ్చర్యకరమైన షాట్లతో అందరినీ అలరించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు.
ఈ సీజన్ స్టార్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ
వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో ఇప్పటికే టీమిండియా దిగ్గజ బౌలర్లనే వణికించాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. అలాగే చెన్నైపై 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐదు మ్యాచ్‌ల్లో 263.15 స్ట్రైక్ రేట్‌తో 200 పరుగులు సాధించిన ఈ వండర్ కిడ్.. హైదరాబాద్ మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ.. తన తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతాపై మళ్లీ పుంజుకుంటాడని జట్టు యాజమాన్యం గట్టి నమ్మకంతో ఉంది. కోచ్ ఇచ్చిన ఈ భరోసా వైభవ్‌కు కొండంత అండగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications