అందుకే సంజూ శాంసన్ సింగిల్ తీయలేదు: కుమార సంగాక్కర

#IPL2021,RR vs PBKS : Kumar Sangakkara Explains Why Sanju Samson Denied A Single

ముంబై: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు ఆ టీమ్ డైరెక్టర్, శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర అండగా నిలిచాడు. పంజాబ్ కింగ్స్‌తో సోమవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 4 పరుగులతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. కెప్టెన్ సంజూ శాంసన్(63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119) సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండాపోయింది. అయితే అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఆఖరి ఓవర్లో రాజస్థాన్‌ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. తొలి నాలుగు బంతుల్లో 0,1,1,6 మొత్తం 8 పరుగులు వచ్చాయి.

దాంతో రాజస్తాన్‌ గెలుపునకు 2 బంతుల్లో 5 పరుగులు అవరసమయ్యాయి. ఐదో బంతిని సామ్సన్‌ లాంగ్‌ఆఫ్‌ వద్దకు ఆడగా... మోరిస్‌ సింగిల్‌ కోసం వచ్చాడు. కానీ సామ్సన్‌ సింగిల్‌ తీయకుండా ఉండిపోయాడు. దాంతో చివరి బంతికి రాజస్థాన్‌ గెలుపునకు 5 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆరో బంతిని సామ్సన్‌ కవర్స్‌లో కొట్టిన భారీ షాట్‌ బౌండరీ దాటకుండా పంజాబ్‌ ఫీల్డర్‌ దీపక్‌ హుడా చేతికి చిక్కడంతో రాజస్థాన్ ఓటమిపాలైంది. అయితే కీలక సమయంలో శాంసన్ సింగిల్ తీయకపోవడాన్ని కొంతమంది మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. మరో ఎండ్‌లో వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్ క్రిస్ మోర్రీస్ ఉన్నాడని, అతను కూడా బౌండరీలు ఆడగలడని, కానీ శాంసన్ అత్యుత్సాహం ప్రదర్శించడాని విమర్శించారు.

సింగిల్ తీయకపోవడం సరైందే..

సింగిల్ తీయకపోవడం సరైందే..

అయితే ఈ విమర్శలపై మ్యాచ్ అనంతరం స్పందించిన కుమార సంగక్కర.. శాంసన్‌ సింగిల్ తీయకపోవడం సరైందేనని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ ఫినిష్ చేయగలననే నమ్మకం అతనికి ఉంది కాబట్టే అలా చేశాడని, చివరి బంతిని కూడా దాదాపు సిక్స్‌గా మలిచే ప్రయత్నం చేశాడన్నాడు. కానీ దురదృష్టవశాత్తు బంతి బౌండరీ‌కి కొన్ని అడుగుల ముందు పడిపోయిందన్నాడు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితుల్లో సులువుగా సిక్సర్ బాదేస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘మ్యాచ్‌ను పూర్తి చేయగలనని సంజూ తనను తాను నమ్ముకున్నాడు. దాదాపు మ్యాచ్‌ను గెలిపించేంత పని చేశాడు. కానీ దురదృష్టవశాత్తు చివరి షాట్.. బౌండరీకి ఫైవ్, సిక్స్ యార్డ్స్ ముందు పడింది.

నెక్ట్స్ టైమ్ పక్కా సిక్స్..

నెక్ట్స్ టైమ్ పక్కా సిక్స్..

కొన్నిసార్లు మన హిట్టింగ్ మీద మనకు నమ్మకం ఉంటుంది. ముఖ్యంగా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు మ్యాచ్ పూర్తి చేయగలమనే నమ్మకం ఏర్పడుతుంది. సంజూ అలా బాధ్యత తీసుకోవడం బాగుంది. మనమంతా వదిలేసిన సింగిల్ గురించే మాట్లాడుతున్నాం. కానీ ఆ ఆటగాడి నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, కమిట్‌మెంట్‌ను గుర్తించలేకపోతున్నాం. అతనికి తన బలాలు ఏంటో బాగా తెలుసు. అలానే సంజూ మ్యాచ్‌ను ముగించేంత పనిచేశాడు. కానీ కొద్దిలో మిస్సయ్యాడు. ఆటలో ఇలాంటివి సహజమే. కానీ మరోసారి ఇలాంటి పరిస్థితి వస్తే మాత్రం సంజూ కచ్చితంగా 10 యార్డ్స్ బయటే కొట్టి విజయాన్నందిస్తాడు.'అని సంగక్కర్ ధీమా వ్యక్తం చేశాడు.

సింగిల్ తీస్తే రనౌట్ అయ్యేవాడు..

సింగిల్ తీస్తే రనౌట్ అయ్యేవాడు..

బ్రియాన్ లారా సైతం సంజూ సింగిల్ తీయకపోవడాన్ని సమర్థించాడు. ‘సంజూ శాంసన్‌ సింగిల్ తీయకపోవడం సరైన నిర్ణయం. బౌండరీ కొట్టడానికి సంజూ శాంసనే సరైనవాడని నా అభిప్రాయం. ఒకవేళ అతను సింగిల్‌కు వెళ్లి స్ట్రైకింగ్ కోసం డబుల్ తీసుంటే సులువుగా రనౌటయ్యేవాడు. అందుకే అతను తీసుకున్న నిర్ణయం సరైందంటున్నా. అతని ఇన్నింగ్స్ అత్యద్భుతం. సింగిల్ తీయలేదని సంజూను నేను నిందించాలనుకోవడం లేదు'అని లారా స్టార్ స్పోర్ట్స్‌తో అన్నాడు.

సూపర్ బ్యాటింగ్..

సూపర్ బ్యాటింగ్..

ఇక భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం సంజూకు అండగా నిలిచాడు. సింగిల్ తీయకుండా తనను తాను నమ్ముకున్నాడని తెలిపాడు. అతని బ్యాటింగ్ అద్భుతమని, మ్యాచ్ గెలిపించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘సంజూ శాంసన్‌ది అత్యద్భుత ప్రదర్శన. అతని పోరాటానికి విజయం దక్కాల్సింది. మైదానం మొత్తం అతను ఆడిన షాట్లు ఆకట్టుకున్నాయి. ఎక్స్‌ట్రా కవర్ దిశగా భారీ షాట్లు ఆడటం అంత సులువైన పనికాదు. కానీ సంజూ చివరి బంతి వరకు అద్భుతంగా పోరాడాడు. టెస్ట్ బుక్‌లోని షాట్స్‌కు అతని బలాన్ని జతచేసి ఆడాడు. కచ్చితంగా ఈ మ్యాచ్ అతను గెలవాల్సింది'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, April 13, 2021, 15:53 [IST]
Other articles published on Apr 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X