34ఓవర్లలోనే లక్ష్యం హాంఫట్
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే ఇండియా భారత్ ఏ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 220 పరుగుల లక్ష్యాన్ని కేవలం 34ఓవర్లలోనే ఛేదించింది. తొలుత న్యూజిలాండ్ ఏ బ్యాటర్లలో రచిన్ రవీంద్రా (61పరుగులు 65బంతుల్లో 9ఫోర్లు), జో కార్టర్ (72పరుగులు 80బంతుల్లో 1ఫోర్, మూడు సిక్సర్లు) రాణించారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 1, రాహుల్ చాహర్ 2, రాజ్ బవ 1, కుల్దీప్ యాదవ్ 4, రిషి ధావన్ 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నారు. ఇక ఛేదనలో భారత బ్యాటర్లు దంచికొట్టారు. ఓపెనర్లు పృథ్వీ షా (77పరుగులు 48బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (30పరుగులు 34బంతుల్లో 4ఫోర్లు, 1సిక్సర్) ధాటిగా ఆడి స్కోరుబోర్డును రంకెలెత్తేంచారు. వీరిద్దరు కలిసి 82పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రజత్ పాటిదార్ (20), కెప్టెన్ సంజూ శాంసన్ (37పరుగులు 35బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు), రిషీ ధావన్ (22 నాటౌట్), శార్దూల్ ఠాకూర్ (25నాటౌట్) రాణించడంతో ఇండియా సునాయసంగా గెలుపొందింది.

గతంలో రెండుసార్లు హాట్రిక్
హ్యాట్రిక్ వికెట్లు తీయడం కుల్దీప్‌కు ఇది తొలిసారేం కాదు. 2017 సెప్టెంబర్‌లో కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాపై కుల్దీప్ హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాత 2019లో వెస్టిండీస్‌పై కుల్దీప్ మరో హ్యాట్రిక్ సాధించాడు. తాజాగా తీసిన హ్యాట్రిక్ కుల్దీప్ ఖాతాలో మూడోది. ఇటీవల మంచి ఫామ్ కనబర్చుతున్నప్పటికీ.. అతని జాతీయ జట్టులో మాత్రం స్థానం దక్కడం లేదు. ఆసియా కప్‌కు, టీ20 ప్రపంచకప్ లాంటి బిగ్ టోర్నీలకు కుల్దీప్ మిస్సయ్యాడు. 2017లో తొలిసారిగా జాతీయ జట్టులోకి కుల్దీప్ వచ్చాడు. ఆ తర్వాత వన్డేలు, టీ20లతో పాటు.. కుల్దీప్ టెస్ట్ క్రికెట్ కూడా ఆడాడు..
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆసీస్‌పై ఆరు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు.

ఐపీఎల్లోనే కుల్దీప్ మార్క్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విషయానికొస్తే.. కుల్దీప్ యాదవ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత అతను ఢిల్లీ క్యాపిటల్స్‌కి మారాడు. ఐపీఎల్ 2022లో రిషబ్ పంత్ సారథ్యంలో అద్భుతంగా రాణించాడు. ఇక ఇంటర్నేషనల్ కెరీర్లో మొత్తంగా 7 టెస్టులు, 69 వన్డేలు, 25 టీ20ల్లో కుల్దీప్ ఆడాడు. టెస్టుల్లో 26, వన్డేల్లో 112, టీ20ల్లో 44వికెట్లు తీశాడు. అతని ఖాతాలో ఐదుసార్లు నాలుగు వికెట్ల హాల్స్, నాలుగుసార్లు ఐదు వికెట్ల హాల్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications
