IPL 2020: 'ఇగ ఆగలేకపోతున్నా.. వారానికి ఏడు రోజులూ మ్యాచులున్నా ఆడుతా'

దుబాయ్: అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020కి రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 19నుంచి యూఏఈలోని మూడు వేదికల్లో లీగ్ జరగనుండగా.. సుమారు నెల రోజుల ముందుగానే జట్లు అక్కడికి చేరుకుంటున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ గురువారం దుబాయ్ చేరుకోగా.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు శుక్రవారం యూఏఈ గడ్డపై అడుగుపెట్టాయి. మరో రెండు టీమ్‌లు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ అక్కడికి వెళ్లాల్సి ఉంది.

ఏడు రోజులూ మ్యాచులున్నా సంతోషమే:
ఎస్‌వోపీ మార్గదర్శకాల ప్రకారం ప్రతి జట్టు యూఏఈలో దిగిన ఆరు రోజుల్లో మూడు సార్లు (1,3, 6వ రోజు) వైరస్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆరు రోజుల క్వారంటైన్ నిబంధనలకు అనుగుణంగా యూఏఈ చేరుకున్న ఆటగాళ్లు తొలి రోజు తమ హోటల్ రూమ్‌లకే పరిమితమయ్యారు. పక్కపక్క రూమ్‌ల్లో ఉన్న తమ సహచర క్రికెటర్లతో బాల్కనీ నుంచే మాట్లాడుకున్నారు. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ కేకేఆర్ వెబ్ సైట్‌తో మాట్లాడుతూ... 'లాక్‌డౌన్ అమలైన మొదట్లో ఇబ్బందులు పడ్డాను. బయట సాధన చేయలేక పోయా. ఇప్పుడు సర్దుకున్నా. వారానికి ఏడు రోజులూ మ్యాచులున్నా సంతోషమే, ఆడడానికి సిద్ధం' అని అన్నాడు.

శాయశక్తులా కృషి చేస్తాం:
ఐపీఎల్‌కు ముందు ఎక్కువగా సాధన చేయకపోవడం కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ అంటున్నాడు. తమ అభిమానులను గర్వపడేలా చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నాడు. 'ఈ ఐపీఎల్ చాలా భిన్నమైంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నదంతా బాధాకరం. క్రికెట్ ఆడటం మాత్రం ఇప్పుడు సవాలే. అయితే మేం ఆడేటప్పుడు అభిమానులను సంతోషపెట్టాలని మాత్రం అర్థం చేసుకున్నాం. కొన్ని నెలలుగా మేం ఎక్కువగా సాధన చేయలేకపోయాం. అసలు మ్యాచులే ఆడలేకపోయాం. అందుకే మేం ఎదురెళ్లే దారి అడ్డంకులతో నిండివుంటుంది. కానీ మేం శాయశక్తులా కృషి చేస్తాం' అని డీకే తెలిపాడు.

క్రికెట్ ఆడేందుకు ఎదరుచూస్తున్నా:
'మా సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఆడకపోవడంతో అభిమానుల మద్దతు మిస్సవుతాం. ఈడెన్ గార్డెన్స్ మా హృదయం. కొద్దిపాటి ఆత్రుత, ఆందోళనతో యూఏఈకి వచ్చాం. అభిమానుల ఆశీస్సులు తీసుకుంటాం' అని కార్తీక్ పేర్కొన్నాడు. 'చాలా కాలం నుంచి క్రికెట్ ఆడేందుకు ఎదరుచూస్తున్నా. ఎప్పటినుంచో మేమంతా ఇళ్లలోనే ఉండిపోయాం. మానసికంగా సిద్ధమయ్యాం. ఇప్పుడు ఉత్సాహంగా ఉంది. మైదానంలోకి వెళ్లి నన్ను నేను నిరూపించుకొనేందుకు ఆత్రుగా ఎదురుచూస్తున్నా' అని కేకేఆర్ యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications