'సచిన్ సర్ నుంచి ఫోన్ వచ్చిందని తెలిసి నమ్మలేకపోయా'

హైదరాబాద్: గత ఆరు నెలల్లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జీవితమే ఒక్కసారిగా మారిపోయింది. అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్నాడు. ఆరు నెలల క్రితం జట్టులోకి వచ్చినప్పటితో పోలిస్తే కుల్దీప్ యాదవ్ తన ప్రతిభతో జట్టులో ప్రధాన ఆటగాడిగా మారిన సంగతి తెలిసిందే.
అంతేకాదు వన్డేల్లో హ్యాట్రిక్ వికెట్ల్ తీసిన మూడో భారత బౌలర్‌గా అరుదైన గుర్తింపు పొందాడు. సమీప భవిష్యత్తులో కుల్దీప్ ప్రపంచంలోనే బెస్ట్ లెగ్ స్పిన్నర్‌గా మారుతాడని షేన్‌వార్న్ కితాబిచ్చాడు. భారత స్కిప్పర్ కోహ్లీ కూడా అతడో గొప్ప బౌలర్ అని ప్రశంసించాడు.
భారత బౌలింగ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న కుల్దీప్ తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ తనకు ఇచ్చిన సలహా గురించి వెల్లడించాడు. టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం తర్వాత సచిన్ తనకు ఫోన్ చేసి తన లక్ష్యం 500 వికెట్లుగా ఉండాలని పేర్కొన్నాడని తెలిపాడు.
'సచిన్ సర్ నుంచి ఫోన్ వచ్చిందని తెలిసి నమ్మలేకపోయా. నా లక్ష్యం 500 వికెట్లుగా ఉండాలని చెప్పారు. అప్పుడు అర్థమైంది నాకు, క్రికెట్ దేవుడు నా నుంచి ఏదో ఆశిస్తున్నారని' అని కుల్దీప్ యాదవ్ వివరించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications