For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీ,రోహిత్ తిట్లు.. అందుకే నేను స్టంప్స్ వెనక్కి వెళ్లను!' - కుల్దీప్ యాదవ్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీస్‌, ఫైనల్ మ్యాచ్ లో కుల్దీప్‌ యాదవ్‌.. స్టంప్స్‌ వెనక లేకుండా.. త్రో విసిరిన బంతిని పట్టుకోకుండా త్రో మిస్ చేసి విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మ్యాచ్ సమయంలో కెప్టెన్‌ రోహిత్‌, కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా మ్యాచ్ అనంతరం.. తాను స్టంప్స్ వెనక ఎందుకు వెళ్లడో, వాళ్లు ఎందుకు తనపై ఫైర్ అయ్యారో వివరించాడు కుల్దీప్ యాదవ్.

"వాళ్లకు (కోహ్లీ, రోహిత్) కేవలం బంతిని పట్టుకోవడమే కావాలి. జడ్డూ త్రోను బుల్లెట్ లా వేస్తాడు. దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. కొన్ని సార్లు అలా జరుగుతూ ఉంటుంది. పైగా ఫైనల్‌ మ్యాచ్‌లో ఒత్తిడి అనేది ఉంటుంది. కానీ ప్రారంభంలోనే వికెట్ (రచిన్ రవీంద్ర) దక్కడంతో ఆత్మవిశ్వాసం వచ్చింది." అని పేర్కొన్నాడు.

Kuldeep yadav reacts on why he didnot go back behind stumps in semis final champions trophy 2025

ఫైనల్ మ్యాచ్ లో జరిగిందిలా..
41వ ఓవర్‌లో కుల్దీప్‌ వేసిన బంతిని పాయింట్‌లోకి నెట్టిన బ్రాస్‌వెల్‌ ఓ సింగిల్‌ను తీసేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పుడు రవీంద్ర జడేజా బుల్లెట్ స్పీడ్ తో బాల్ ను అందుకొని నాన్‌స్ట్రైకర్‌ వైపు విసిరాడు. అప్పుడు అది వికెట్లకు చాలా దగ్గర నుంచి వెళ్లినప్పటికీ.. అక్కడే ఉన్న కుల్దీప్‌ స్టంప్స్‌ వెనక్కి వెళ్లి బంతిని పట్టుకోలేదు. సెమీస్ మ్యాచ్ లోనూ స్టీవ్‌ స్మిత్‌ ఆడిని బంతిని ఇలానే చేశాడు. దీంతో కోహ్లీ, రోహిత్.. మ్యాచ్ సమయంలోనే అతడిని తిట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

Story first published: Monday, March 10, 2025, 16:23 [IST]
Other articles published on Mar 10, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+