100 ODI wickets: వికెట్ దూరంలో కుల్దీప్ యాదవ్, కటక్ వన్డేలో అందుకునేనా?

హైదరాబాద్: కటక్ వేదికగా ఆదివారం వెస్టిండిస్‌తో జరిగే మూడో వన్డేలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన రికార్డుకి చేరువయ్యాడు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ మరో వికెట్ తీస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో మహ్మద్ షమీతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలుస్తాడు.

భారత 22వ బౌలర్‌గా రికార్డు
మహ్మద్ షమి 56 వన్డేల్లో 100 వికెట్ల క్లబ్‌లో చేరాడు. కటక్ వేదికగా ఆదివారం వెస్టిండిస్‌తో జరిగే మూడో వన్డే కుల్దీప్‌కు 56వది కావడం విశేషం. ఇప్పటివరకు వన్డేల్లో కుల్దీప్ యాదవ్ 99 వికెట్లు తీశాడు. కటక్ వన్డేలో మరో వికెట్ సాధిస్తే వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత 22వ బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు.

సిరిస్ 1-1తో సమం
ఇప్పటికే ముగిసిన రెండు వన్డేల్లో ఇరు జట్ల చెరో మ్యాచ్ నెగ్గడంలో సిరిస్ 1-1తో సమం అయింది. చెన్నైలో జరిగిన మొదటి వన్డేలో 8 వికెట్లతో విండీస్ చేతిలో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

రెండో వన్డేలో హ్యాట్రిక్ తీసిన కుల్దీప్
ఈ మ్యాచ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు. వెస్టిండిస్ ఇన్నింగ్స్ 33వ ఓవర్‌లో వరుస బంతుల్లో హోప్, హోల్డర్, జోసెఫ్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్లో వన్డేల్లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి భారత బౌలర్‌గా కుల్‌దీప్ చరిత్ర సృష్టించాడు.

మూడో వన్డేలో ఏ జట్టు అయితే గెలుస్తుందో
2017లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో కుల్దీప్ యాదవ్ తొలిసారిగా హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే, మూడో వన్డేలో ఏ జట్టు అయితే గెలుస్తుందో ఆ జట్టు సిరిస్ విజేతగా నిలుస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications