Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'కుల్దీప్ యాదవ్ ఎదుగుదల వెనుక అనిల్ కుంబ్లే'

హైదరాబాద్: చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఎదుగుదల వెనుక టీమిండియా మాజీ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ఉన్నాడని సురేశ్ రైనా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ భారత్ విజయంలో కుల్దీప్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ 4-1తో దక్కించుకోగా, మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమమైంది. మూడు టీ20ల సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే నిర్ణయాత్మక మూడో టీ20 హైదరాబాద్ వేదికగా శుక్రవారం జరగనుంది. ఈ సందర్భంగా సురేశ్ రైనా మీడియాతో మాట్లాడాడు.

Kuldeep Yadav is a product of former India coach Anil Kumble: Suresh Raina

'కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శనతో దూసుకెళ్తున్నాడు. అతనిలా ఆడుతున్నాడంటే ఆ ఘనత మాజీ కోచ్‌ కుంబ్లేదే. ఎందుకంటే.. ఈ చైనామన్ బౌలర్‌ని తీర్చిదిద్దే క్రమంలో కోచ్‌గా చాలా కష్టపడ్డాడు. ఈ ఏడాది ఐపీఎల్ సమయంలో కుల్దీప్‌తో నేను ఒకసారి మాట్లాడాను' అని రైనా అన్నాడు.

'అతను అనిల్ కుంబ్లే‌తో ప్రతిరోజూ చాట్ చేస్తూ తన బౌలింగ్‌‌కి మెరుగులు దిద్దుకుంటున్నాడని నాకు అర్థమైంది. కుల్దీప్ కచ్చితంగా కుంబ్లే తయారు చేసిన స్పిన్నరే. ఆస్ట్రేలియాకి చెందిన చైనామన్ బౌలర్ బ్రాడ్‌ హగ్ సూచనలు కూడా అతనికి బాగా పనికొచ్చాయి. ప్రస్తుతం భారత్ జట్టు బౌలింగ్‌ విభాగాన్ని కుల్దీప్ యాదవ్ సమూలంగా మార్చేసి తన ముద్ర వేసేశాడు' అని రైనా అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+