Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎంతమంది స్పిన్నర్లను పెట్టినా.. ఆ ఒక్కడు లేకపోతే టీమిండియాకు కష్టమే: మాజీ క్రికెటర్

ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఆడే అవకాశం ఇవ్వకపోవడంపై టీమిండియా మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ దీప్‌దాస్ గుప్తా అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు తుది జట్టులో కుల్దీప్ యాదవ్‌ను చేర్చాలని ఆయన కోరారు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన 3 వన్డేల సిరీస్ కోసం భారత జట్టులోకి తీసుకున్న లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. భారత్ ఆ సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది.

CWG 2026: ఏది ఏమైనా తగ్గేదే లే.. 102 డిగ్రీల జ్వరంతోనూ కామన్వెల్త్ స్వర్ణం!

CWG 2026: ఏది ఏమైనా తగ్గేదే లే.. 102 డిగ్రీల జ్వరంతోనూ కామన్వెల్త్ స్వర్ణం!

ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్న కుల్దీప్ యాదవ్.. అక్కడ జరుగుతున్న వన్డే కప్ మ్యాచ్‌లలో యార్క్ షైర్ తరఫున ఆడుతున్నాడు. యార్క్‌షైర్ తరఫున ఆడుతున్న కుల్దీప్ యాదవ్, ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వికెట్ తీసి అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. కుల్దీప్ యాదవ్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లలో 8 వికెట్లు తీసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

Kuldeep Yadav is Crucial for India in Sri Lanka Tests Former Cricketer Deep Dasgupta Spinner Must be Included

ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టులో కుల్దీప్‌ యాదవ్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. తన యూట్యూబ్ ఛానెల్‌లో దీప్ దాస్‌గుప్తా మాట్లాడుతూ.. "కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా జట్టులో ఉండాలి. నేను నలుగురు స్పిన్నర్ల గురించి మాట్లాడుతున్నాను. అందులో ఖచ్చితంగా ముగ్గురు స్పిన్నర్లతో ఆడతారు" అని దీప్ దాస్‌గుప్తా అన్నారు."నేను అతడిని ఇంగ్లాండ్‌లో చూశాను, చాలా మంది చూశారు. కానీ దురదృష్టవశాత్తు సెలెక్టర్లు అతడిని చూడలేదు, అది వేరే విషయం" అని ఆయన పరోక్షంగా విమర్శించారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌పై భారత్ ఆశలు వదులుకోవాలి: మాజీ క్రికెటర్

డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌పై భారత్ ఆశలు వదులుకోవాలి: మాజీ క్రికెటర్

"ఇది ఓ మంచి జట్టు అని నేను భావిస్తున్నాను. పిచ్ పరిస్థితులను బట్టి తక్కువ మంది పేసర్లను, ఎక్కువ మంది స్పిన్నర్లను ఎంపిక చేశారు. కొన్నిసార్లు నలుగురు స్పిన్నర్లతో ఆడే అవకాశాలు కూడా ఉండవచ్చు. శ్రీలంకలో గతంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయి. అందువల్ల జట్టులో అదనంగా ఓ స్పిన్నర్ ఉండటం అవసరం. వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో, ఈ ఎంపిక ఊహించిన విధంగానే ఉంది" అని దీప్ దాస్‌గుప్తా అన్నారు.

Story first published: Sunday, August 2, 2026, 12:17 [IST]
Other articles published on Aug 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+