Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: విలేకరి పిచ్చి ప్రశ్న.. దిమ్మతిరిగే సమాధానమిచ్చిన కుల్దీప్ యాదవ్

 Kuldeep Yadav gives fitting reply to a crazy question

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్టులో విజేతలు ఎవరో అప్పుడే ఊహించడం కష్టం కానీ.. బంగ్లాదేశ్ గెలవడం మాత్రం దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్‌లోనే 404 పరుగుల భారీ స్కోరు చేసిన టీమిండియా.. బంగ్లాను కేవలం 150 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో అప్పటికే 250 పరుగులపైగా లోటులో నిలిచింది ఆతిథ్య జట్టు. ఆ తర్వాత కూడా భారత్ బ్యాటింగ్ చేసి బంగ్లా ముందు 513 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఇంగ్లండ్ అయినా కష్టమే..

ఇంగ్లండ్ అయినా కష్టమే..

ఇంతటి లక్ష్యాన్ని ఛేదించడం ‘బాజ్ బాల్' ఆడుతున్న ఇంగ్లండ్‌కైనా కష్టమే. అలాంటిది బంగ్లా టార్గెట్ ఛేదిస్తుందా? అంటే దాదాపుగా చెయ్యలేదనే చెప్పాలి. అయితే వికెట్లు కాపాడుకొని ఈ మ్యాచ్‌ను డ్రా చేసే అవకాశమైతే ఉంది. కానీ ఒక విలేకరికి ఎందుకో బంగ్లాదేశ్ గెలుస్తుందని అనిపించింది.

మూడో రోజు ఆట ముగిసిన తర్వాత విలేకరుల సమావేశానికి కుల్దీప్ యాదవ్ వచ్చాడు. ఈ సందర్భంగా ఒక విలేకరి పిచ్చి ప్రశ్న వేశాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు గెలిచే అవకాశం ఉందని అనిపించడం లేదా? అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న విన్న కుల్దీప్ ఒకింత ఆశ్చర్యపోయాడు.

దిమ్మతిరిగే సమాధానం..

దిమ్మతిరిగే సమాధానం..

విలేకరి ప్రశ్నకు షాకైన కుల్దీప్ వెంటనే తేరుకొని అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. ‘నేనైతే వ్యక్తిగతంగా అలా జరగకూడదనే కోరుకుంటున్నా. ఏమో? వాళ్లలో ఎవరైనా ఒక మూడొందలు కొడితే మీరన్నట్లు జరగొచ్చు. మేమైతే సాధ్యమైనంత త్వరగా వాళ్లను ఆలౌట్ చేయాలని అనుకుంటున్నాం' అని చురకలేశాడు.

ఇది చూసిన వాళ్లంతా నవ్వుకుంటున్నారు. అయితే మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా ఓపెనర్లు తమ వికెట్లను కాపాడుకున్నారు. మొత్తం 12 ఓవర్లు ఎదుర్కొని 42 పరుగులు చేశారు. ఈ క్రమంలో నాలుగో రోజు తొలి సెషన్‌లో భారత బౌలర్లు రాణించడంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.

పిచ్‌పై కుల్దీప్ షాకింగ్ కామెంట్స్

పిచ్‌పై కుల్దీప్ షాకింగ్ కామెంట్స్

తొలి టెస్టు జరుగుతున్న చట్టోగ్రాం పిచ్‌పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉందని, బంతి చాలా తేడాగా వస్తోందని టీమిండియా వెటరన్ ఛటేశ్వర్ పుజారా అన్నాడు. అలాగే పేసర్ మహమ్మద్ సిరాజ్ కూడా ఈ పిచ్ నుంచి బౌలర్లకు మంచి సహకారం అందుతోందని, బ్యాటింగ్ కష్టంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

అయితే కుల్దీప్ మాత్రం ఈ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కే అనుకూలంగా ఉందన్నాడు. కాకపోతే బంతి అనుకున్నంత ఎత్తు ఎగరడం లేదని, అడపా దడపా ఒక బంతి మాత్రమే టర్న్ అవుతోందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులతో టీమిండియాను ఆదుకున్న కుల్దీప్.. ఆ తర్వాత ఐదు వికెట్లు కూల్చి బంగ్లాను దెబ్బ తీసిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, December 17, 2022, 8:05 [IST]
Other articles published on Dec 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+