Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: ఎంతపని చేశావ్ బెన్‌ స్టోక్స్‌.. ఇద్దరు టీమిండియా ఆటగాళ్ల కెరీర్‌ను ప్రమాదంలో పడేశావ్!!

Kuldeep Yadav getting brutally trolled by fans over his disastrous performance in 2nd ODI

పూణే: టీమిండియాతో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (112 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. బెన్ స్టోక్స్ (52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్సర్లు) భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్టోక్స్‌ ధాటికి ఇంగ్లండ్‌ మరో 6.3 ఓవర్లు ఉండగానే 337 పరుగుల లక్ష్యాన్ని సుమాయాసంగా చేధించింది. స్టోక్స్‌ ధాటికి భారత బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (10 ఓవర్లలో 84), కృనాల్ పాండ్యా (7 ఓవర్లలో 72)లు.

8 సిక్సులు:

8 సిక్సులు:

ఛేదనలో బెన్ స్టోక్స్‌ తొలి బంతి నుంచే చెలరేగాడు. తొలి మూడు సిక్సర్లు కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లోనే కొట్టిన స్టోక్స్.. 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు రనౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అనంతరం దూకుడు పెంచి కుల్దీప్‌ యాదవ్ ఓవర్లో ఒక సిక్స్‌, ఫోర్‌ బాది 40 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్కును చేరుకున్నాడు. అర్ధ సెంచరీ తర్వాత 11 బంతుల్లో వరుసగా 6, 6, 6, 1, 6, 4, 2, 6, 6, 2, 4 (మొత్తం 49) పరుగులు చేశాడు. ముఖ్యంగా కుల్దీప్‌ ఓవర్లో కొట్టిన మూడు వరుస సిక్సర్లు, కృనాల్‌ ఓవర్లో కొట్టిన 3 సిక్స్‌ లు, 1 ఫోర్‌ మ్యాచును టీమిండియాకు దూరం చేసింది. ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ ధాటికి కుల్దీప్ ఏకంగా 8 సిక్సులు ఇచ్చాడు.

ఏకంగా 84 పరుగులు:

ఏకంగా 84 పరుగులు:

తన తొలి 6 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఫరవాలేదనిపించిన కుల్దీప్‌ యాదవ్.. తర్వాతి నాలుగు ఓవర్లలో వరుసగా 8, 17, 20, 7 (మొత్తం 52) చొప్పున పరుగులిచ్చి ఉసూరుమనిపించాడు. మ్యాచ్‌లో మొత్తం పది ఓవర్లు బౌల్ చేసిన కుల్దీప్ ఏకంగా 84 పరుగులు ఇవ్వడం గమనార్హం. కృనాల్ పాండ్యా కూడా 7 ఓవర్లలో 72 రన్స్ ఇచ్చేశాడు. రెండో వన్డే మ్యాచ్‌లో ఓటమి ఎదురవడంతో టీమిండియా అభిమానులు కొందరు ట్రోలింగ్‌ షురూ చేశారు. ముఖ్యంగా కుల్దీప్‌పై.

ఎంతపని చేశావ్ స్టోక్స్:

ఎంతపని చేశావ్ స్టోక్స్:

'కుల్దీప్.. ఇక నీ సేవలు ఇక చాలు. బ్యాగ్‌ సర్దుకో' అని ఒకరు కామెంట్‌ చేయగా.. 'కుల్దీప్‌ పర్ఫామెన్స్‌ విత్‌ ధోనీ.. వితౌట్‌ ధోనీ' అని మరొకరు కామెంట్‌ చేశారు. 'ఎంతపని చేశావ్.. బెన్ ‌స్టోక్స్.‌ ఇద్దరు టీమిండియా ప్లేయర్ల కెరీర్‌ని డేంజర్‌లో పడేశాడు. వారిద్దరు ఎవరంటే.. కుల్దీప్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్యా' అని ఒకరు ట్వీట్ చేశారు. 'కృనాల్‌ లాంటి ఆటగాడితో.. రోహిత్‌ ఐపీఎల్‌లో విజయం సాధించాడు. ఈ సాహసానికి రోహిత్‌కి మరో ట్రోఫీ ఇవ్వొచ్చు' అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'ఈ మ్యాచ్ తర్వాత బహుశా కుల్దీప్‌ రిజర్వ్ బెంచీకి పరిమతమయ్యే అవకాశాలే ఎక్కువ' అంటూ కెమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గత రెండు మ్యాచులలో ఘోరంగా విఫలమైన కుల్దీప్ స్థానంలో యజువేంద్ర చహాల్ మూడో వన్డే ఆడొచ్చు.

అత్యంత చెత్త రికార్డు :

అత్యంత చెత్త రికార్డు :

రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్ పేరిట అత్యంత చెత్త రికార్డు నమోదైంది. ఎక్కువ సిక్సులు ఇచ్చిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ చైనామెన్ స్పిన్నర్ 10 ఓవర్ల స్పెల్‌లో ప్రత్యర్థి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు ఏకంగా 8 సిక్సులు బాదారు. ఇంతకుముందు ఈ రికార్డు మీడియం పేసర్ ఆర్ వినయ్ కుమార్ పేరున ఉంది. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో వినయ్ బౌలింగ్‌లో కంగారు బ్యాట్స్‌మెన్లు ఏడు సిక్సర్లు కొట్టారు. నిన్నటి వన్డేలో కుల్దీప్ ఈ రికార్డును ఒక సిక్సర్ తేడాతో దాటేశాడు.

Story first published: Saturday, March 27, 2021, 15:28 [IST]
Other articles published on Mar 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+