Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వెస్టిండీస్ నడ్డి విరిచిన కుల్దీప్ యాదవ్.. 64 ఏళ్ల ప్రపంచ రికార్డు సమం!

Kuldeep Yadav: భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల హాల్ సాధించి కుల్దీప్ యాదవ్ 64 ఏళ్ల ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో అదరగొడుతున్నారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ మాయాజాలం ముందు వెస్టిండీస్ బ్యాటర్లు నిలవలేకపోయారు.

కుల్దీప్ యాదవ్ రికార్డు
వెస్టిండీస్ తో రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ 26.5 ఓవర్లలో 82 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇది కుల్దీప్ టెస్ట్ కెరీర్‌లో 5వసారి 5 వికెట్ల హాల్ కావడం విశేషం. ఈ ప్రదర్శనతో కుల్దీప్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధికంగా 5 వికెట్ల హాల్ సాధించిన ఎడమచేతి వాటం రిస్ట్ స్పిన్నర్‌గా 64 ఏళ్ల రికార్డును సమం చేశాడు. అంతకుముందు ఈ రికార్డు జానీ వార్డ్‌లే పేరిట ఉంది.

Kuldeep Yadav Equals 64-Year-Old World Record with Stunning 5-Wicket Haul vs West Indies

జానీ వార్డ్‌లే తన కెరీర్‌లో ఈ ఘనతను 5 సార్లు సాధించాడు. అయితే అతను దీనిని 28 టెస్ట్ మ్యాచ్‌లలో పూర్తి చేశాడు. కానీ కుల్దీప్ యాదవ్ కేవలం 15 టెస్ట్ మ్యాచ్‌లలోనే ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. జానీ వార్డ్‌లే 1964లో ఈ రికార్డును నెలకొల్పగా.. ఇప్పుడు కుల్దీప్ యాదవ్ దానిని సమం చేశాడు. కుల్దీప్ రోజురోజుకు తన బౌలింగ్‌ను మెరుగుపరుచుకుంటూ ఈ రికార్డును త్వరలోనే బద్దలు కొడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

248 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్
కుల్దీప్ అద్భుత ప్రదర్శన కారణంగా వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 248 పరుగులకే ఆలౌట్ అయింది. కుల్దీప్ యాదవ్‌కు తోడుగా, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. భారత్ 270 పరుగుల భారీ ఆధిక్యం సాధించి, మ్యాచ్‌పై పూర్తి పట్టు బిగించింది.

Story first published: Sunday, October 12, 2025, 15:14 [IST]
Other articles published on Oct 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+