IND vs PAK: టీమిండియాలో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరైన కుల్దీప్ యాదవ్ సైలెంట్ గా భారీ మైలురాయిని సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో మూడు కీలక వికెట్లు పడగొట్టి భారత జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కేవలం 241 పరుగులు మాత్రమే చేసింది. కుల్దీప్ యాదవ్ 9 ఓవర్లలో 40 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ మిడిల్ ఆర్డర్ లోని ఇద్దరు పాక్ బ్యాటర్లు సల్మాన్ ఆఘా, షాహీన్ షా అఫ్రిదిలను వరుసగా ఔట్ చేయడం ద్వారా పాకిస్థాన్ జట్టుపై తీవ్ర ఒత్తిడిని పెంచాడు.
ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్ తరఫున 300 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కుల్దీప్ ఇప్పుడు 13వ స్థానంలో ఉన్నాడు. అంతే కాకుండా 300 వికెట్ల మైలురాయిని చేరుకున్న ఐదో భారత స్పిన్నర్ గా కుల్దీప్ నిలిచాడు. ఈ నేపథ్యంలో కుల్దీప్ పలువురి ప్రశంసలు అందుకున్నాడు.

కుల్దీవ్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ గణాంకాలు..
*టెస్టులు: 13 మ్యాచ్ లు, 56 వికెట్లు, బెస్ట్ బౌలింగ్ 5/40.
*వన్డేలు: 109 మ్యాచ్ లు, 174 వికెట్లు, బెస్ట్ బౌలింగ్ 6/25.
*టీ-20 మ్యాచ్ లు: 40 మ్యాచ్ లు, 69 వికెట్లు, బెస్ట్ బౌలింగ్ 5/17.
అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల పూర్తి జాబితా..
అనిల్ కుంబ్లే-953
రవిచంద్రన్ అశ్విన్-765
హర్భజన్ సింగ్-707
కపిల్ దేవ్ -687
రవీంద్ర జడేజా-604
జహీర్ ఖాన్-597
జవకల్ శ్రీనాథ్-551
మహ్మద్ షమీ-458
జస్ప్రీత్ బుమ్రా-443
ఇషాంత్ శర్మ-434
అజిత్ అగార్కర్ -349
ఇర్ఫాన్ పఠాన్-301
కుల్దీప్ యాదవ్-301*
Big Win!
— Kuldeep yadav (@imkuldeep18) February 23, 2025
@imVkohli bhai Special 💯
& 300 int. wickets ! Grateful for the journey!✨ pic.twitter.com/z8dE8EVKeW
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కు కుల్దీప్ అర్హుడు..
భారత్, పాక్ మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీతో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. కానీ కొంత మంది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కు మరొక ఆటగాడు అర్హుడని పేర్కొన్నారు. ఆ ఆటగాడు మరెవరో కాదు కుల్దీప్ యాదవ్. ఈ మ్యాచ్ లో కుల్దీప్ 3 వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్ ఇన్నింగ్స్ లో ప్రమాదకరమైన బ్యాటర్ల సల్మాన్ అలీ ఆఘా, షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షాలను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ భారీ స్కోరు చేయకుండా కుల్దీప్ ఆపాడు. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కు అర్హుడని కొందరు అభిప్రాయపడుతున్నారు.