కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్ల వీడియోని చూశారా?
హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియతో జరిగిన రెండో వన్డేలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి స్పిన్నర్‌గా.. వన్డేల్లో హ్యాట్రిక్ ఫీట్ నమోదు చేసిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
మొత్తంగా భారత్ తరఫున హ్యాట్రిక్ సాధించిన బౌలర్లలో మూడో బౌలర్‌గా నిలిచాడు. గురువారం ఆస్ట్రేలియాతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో కుల్దీప్ ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ 33వ ఓవర్‌లో కుల్దీప్ ఓ అద్భుతాన్నే చేసి చూపించాడు.
32.2వ బంతికి మాథ్యూ వేడ్, 32.3వ బంతికి అగర్, 32.4వ బంతికి కమిన్స్‌ను వరుస బంతుల్లో పెవిలియన్‌కు కుల్దీప్ హ్యాట్రిక్ రికార్డు అందుకున్నాడు. అంతకముందు 1987లో చేతన్ శర్మ న్యూజిలాండ్‌పై ఈ ఘనత సాధించి తొలి హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించాడు.
ఆ తర్వాత 1991లో ఇదే ఈడెన్‌లో శ్రీలంకపై కపిల్ దేవ్ హ్యాట్రిక్ సాధించాడు. 26 ఏళ్ల తర్వాత మళ్లీ కుల్దీప్ యాదవ్ ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్ల వీడియోలు మీకోసం.....
తొలి వికెట్‌గా మాథ్యూ వేడ్
32వ ఓవర్‌లో కుల్‌దీప్ విసిరిన 2వ బంతికి మాథ్యూ వేడ్ (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
రెండో వికెట్‌గా ఆస్టన్ అగర్
32వ ఓవర్‌లో కుల్‌దీప్ విసిరిన 3వ బంతికి ఆస్టన్ అగర్ ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయ్యాడు.
మూడో వికెట్‌గా ప్యాట్ కమిన్స్
32వ ఓవర్‌లో కుల్‌దీప్ విసిరిన 4వ బంతికి ప్యాట్ కమిన్స్ ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
కుల్దీప్‌ని అభినందిస్తున్న భారత ఆటగాళ్లు
హ్యాట్రిక్ వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్‌ని అభినందిస్తున్న భారత ఆటగాళ్లు. 32వ ఓవర్‌లో కుల్‌దీప్ విసిరిన 2వ బంతికి మాథ్యూ వేడ్ (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే ఆస్టన్ అగర్ ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయ్యాడు. అగర్ తర్వాత ప్యాట్ కమిన్స్ ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఇలా మూడు వికెట్లు వరుసగా తీసి కుల్దీప్ తన ఖాతాలో హ్యాట్రిక్ వేసుకున్నాడు. హ్యాట్రిక్ తీసిన కుల్దీప్‌ను సహచర ఆటగాళ్లు మైదానంలోనే అభినందించారు. మరోవైపు ఈడెన్ గార్డెన్స్ ఒక్కసారిగా అభిమానుల హర్షధ్వానాలతో మిన్నంటింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications