For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీపై చేసిన వ్యాఖ్యలు తప్పుగా చిత్రీకరించారు'

IPL 2019 : Kuldeep Yadav Clarifies Comments On Mahendra Singh Dhoni ! || Oneindia Telugu
Kuldeep Yadav clarifies comments on Mahendra Singh Dhoni, slams ‘false’ media reports

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీపై చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా చిత్రీకరించిందని టీమిండియా రిస్ట్ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ అన్నారు. ముంబైలో సోమవారం జరిగిన సియెట్‌ క్రికెట్‌ రేటింగ్‌ అవార్డ్స్‌ ఫంక్షన్‌లో కుల్దీప్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుల్దీప్‌ మాట్లాడుతూ ధోనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో కుల్‌దీప్‌ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

'ఎటువంటి కారణం లేకుండా వదంతులు సృష్టించాలనుకున్న కొన్ని మీడియా సంస్థలకు ఓ విషయం చెప్పదలుచుకున్నా. కొందరు అనవసరంగా నేను చేసిన వ్యాఖ్యలను రాద్దాంతం చేశారు. నాపై వచ్చిన వార్తలన్నీ అసత్యాలే. నేను ఎవరి గురించీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నాకు మహీ భాయ్‌ అంటే ఎంతో గౌరవం' అని స్పష్టం చేశాడు.

Kuldeep Yadav clarifies comments on Mahendra Singh Dhoni, slams ‘false’ media reports

సియెట్‌ క్రికెట్‌ రేటింగ్‌ అవార్డ్స్‌ ఫంక్షన్‌లో కుల్దీప్‌ మాట్లాడుతూ... 'ధోనీ ఇచ్చిన సలహాలు కూడా చాలాసార్లు పనిచేయలేదు. అయినా ఆ విషయాన్ని ఆయనకు చెప్పలేదు' అని కుల్దీప్‌ వ్యాఖ్యానించాడు. 'ధోనీ ఎక్కువ మాట్లాడడు. మ్యాచ్‌లో అవసరమైన సందర్భంలో.. ఓవర్ల మధ్య విరామ సమయంలో తన అభిప్రాయాలను బౌలర్‌తో చెపుతారు' అని కుల్దీప్‌ పేర్కొన్నారు.

Story first published: Thursday, May 16, 2019, 8:53 [IST]
Other articles published on May 16, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+