బంతిపై పట్టు కోసం.. కుల్దీప్ ఏం చేశాడో తెలుసా?
హైదరాబాద్: ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా సిరిస్‌లో తన చైనామన్ బౌలింగ్‌తో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ముప్పుతిప్పులు పెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో టామ్ లాథమ్, రాస్ టేలర్ స్వీప్, రివర్స్ స్వీప్‌లతో కుల్దీప్ బౌలింగ్‌లో పరుగుల వరద పారించారు.
దీంతో రెండో వన్డేలో చోటు కోల్పోయాడు. ఇక, బుధవారం నుంచి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ ఆరంభంకానున్న నేపథ్యంలో మళ్లీ కుల్దీప్ యాదవ్ నెట్స్‌లో తీవ్రంగా కసరత్తులు చేశాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మంగళవారం నెట్స్‌లో కుల్దీప్ యాదవ్ తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు.

భారత్‌లో అక్టోబర్ నుంచి జనవరి వరకు మంచు కురుస్తుంది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో భారీ లక్ష్యాల్ని సైతం ఛేదించడం సులభమవుతుంది. బౌలర్లకు బంతిపై పట్టు దొరకడం కష్టంగా మారుతుంది. దీంతో బంతిపై పట్టు సాధించేందుకే టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్... కుల్దీప్ చేత వినూత్నంగా ప్రాక్టీస్ చేయించాడు.
ప్రతి బంతిని విసిరే ముందు నీటిలో వేళ్లని ముంచి అనంతరం బౌలింగ్ చేశాడు. బంతిపై పట్టు సాధించేందుకే కోచ్ ఇలా సూచించినట్లు తెలుస్తోంది. గతంలో భువనేశ్వర్ కుమార్ సైతం ఇలాగే సాధన చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆదివారం ముగిసిన మూడు టీ20ల సిరిస్‌ని భారత్ 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మూడు టీ20ల సిరిస్‌లోనైనా గెలిచి తీరాలనే పట్టుదలతో న్యూజిలాండ్ ఉంది. న్యూజిలాండ్‌తో తలపడిన ఏ టీ20లోనూ భారత్‌కు విజయం సాధించలేదు. 2007 నుంచి చూస్తే కివీస్‌తో భారత్ ఐదు టీ 20ల్లో తలపడగా అన్నింట్లోనూ ఓటమి పాలైంది. దీంతో ఫిరోజ్ షా కోట్లాలో తొలి మ్యాచ్ గెలిచి ఖాతా తెరవాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications